Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. భయంతో ఇళ్లలో నుంచి పరుగులు తీసిన ప్రజలు! తైవాన్ తూర్పు నగరమైన హువాలియన్‌లో భారీ భూకంపం సంభవించింది. 6.3 తీవ్రతతో 9.7 కిలో మీటర్ల లోతులో భూకంపం సంభవించగా రాజధాని తైపీలో భవనాలు కంపించినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. భయంతో ప్రజలు ఇళ్లలో నుంచి పరుగులు తీసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. By srinivas 16 Aug 2024 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి Earthquake: తైవాన్‌ను భారీ భూకంపం వణికించింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున తైవాన్ లోని తూర్పు నగరమైన హువాలియన్ కు 34 కిలో మీటర్లు (21.13 మైళ్లు) దూరంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం దాటికి రాజధాని తైపీలో భవనాలు కంపించాయి. భూకంపం 9.7 కిలో మీటర్ల లోతులో ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంగా భవనాలు ఊగడంతో ప్రజలు ఇళ్లలో నుంచి పరుగులు తీయగా ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. #earthquake #taiwan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి