Crime : మగబిడ్డను కనలేదని.. భార్య, ముగ్గురు కూతుళ్ల గొంతు కోసి చంపిన వ్యక్తి! భార్య మగబిడ్డను కనట్లేదనే కోపంతో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. బిహార్‌కు చెందిన ఇదు మియాన్ భార్యతోపాటు ముగ్గురు ఆడపిల్లలను గొంతుకోసి హతమార్చాడు. పరారిలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. By srinivas 30 Mar 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Bihar : భార్య మగబిడ్డను కనలేకదనే కోపంతో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. కట్టుకున్న భార్యతోపాటు తన కడుపున పుట్టిన ముగ్గురు కూతుళ్లను అతి కిరాతకంగా హతమార్చాడు(Murder). ఈ దారుణ ఘటన బిహార్‌లో చోటుచేసుకోగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మగబిడ్డ కావాలనుకుని.. ఈ మేరకు పోలీసుల వివరాల ప్రకారం.. బిహార్ చంపారణ్జిల్లా(Champaran District) లో ఈ ఘటన జరిగింది. ఇదు మియాన్ (50), అఫ్రీన్ఖాతున్ (40) దంపతులకు ముగ్గురు అర్బున్ ఖాతున్ (15), షబ్రున్ ఖాతున్(12), షెహ్బాజ్ ఖతున్ (9) ఆడపిల్లలున్నారు. అయితే మగబిడ్డ కావాలనుకున్న ఇదు మియాన్‌కు.. ముగ్గురూ ఆడబిడ్డలే పుట్టడంతో అతను నిరాశచెందాడు. ఇదే విషయంపై చాలా సంవత్సరాలుగా భార్యను హింసిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇది కూడా చదవండి : BJP: మహిళకు లంచం ఇస్తూ అడ్డంగా బుక్కైన బీజేపీ నాయకుడు.. వీడియో వైరల్! భార్యను గొంతు కోసి.. ఈ క్రమంలోనే గొడవ(Fight) ముదరడంతో కోపంతో ఊగిపోయిన నిందితుడు.. భార్యను గొంతు కోసి చంపేశాడు. అనంతరం తన ముగ్గురు ఆడబిడ్డలను సైతం గొంతు కోసి, హత్య చేసి నుంచి పారిపోయాడు. స్థానికులకు పోలీసులకు సమాచారం అందించగా ఘటనాస్థలానికి వెళ్లి ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. మొదటి భార్య చనిపోవడంతో.. ఇక ఇదు మియాన్ఇది రెండోపెళ్లి. మొదటి భార్య కొన్నేళ్ల క్రితం చనిపోయింది. వారికి ఇద్దరు మగబిడ్డలు ఉన్నారు. మొదటి భార్య మరణంతో.. రెండో పెళ్లి(Second Marriage) చేసుకున్నాడు ఇదు మియాన్. రెండో భార్యతో అతనికి ఐదుగురు ఆడబిడ్డలు పుట్టారు. మొదటి బిడ్డకు పెళ్లి జరిగింది. 2017లో తన 16ఏళ్ల కూతురును చంపేశాడు. ఉత్తర్ ప్రదేశ్ సీతాపూర్ సమీపంలో రైలులో నుంచి బయటకు తోసేసి చంపేశాడు. ఈ ఘటనలో అతనికి జైలు శిక్షపడింది. ఐదేళ్ల జైలు శిక్ష తర్వాత.. 2022లో బెయిల్‌పై బయటకి వచ్చాడు. #murder #bihar #man-who-killed-his-wife-and-three-children మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి