Viral Video: వీడెవడ్రా బాబూ.. చిరుతతో సెల్ఫీ దిగాడు

చిరుతలు సాధారంగా పొలాల్లోకి, గ్రామాల్లోకి వస్తుంటాయి. ఓ వ్యక్తి తన పొలంలోకి వచ్చిన చిరుతతో ప్రశాంతంగా ఫ్రెండ్‌తో దిగినట్టు సెల్ఫీ దిగాడు. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఆ వీడియో మీరు చూడాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Viral Video: వీడెవడ్రా బాబూ.. చిరుతతో సెల్ఫీ దిగాడు

Viral Video: ఎన్టీఆర్‌ సినిమాలో డైలాగ్‌ అందరికీ గుర్తుండే ఉంటుంది.. పులిని దూరం నుంచి చూడాలనిపించిందనుకో చూసుకో, ఫొటో దిగాల‌నిపించింది అనుకో కొంచెం రిస్క్ అయినా ట్రై చేయొచ్చు.. చ‌నువిచ్చింది క‌దా అని పులితో ఆటాడుకోవాల‌నుకుంటే మాత్రం వేటాడేస్తది. సరిగ్గా ఇదే జరిగింది. చిరుతలు సాధారంగా పొలాల్లోకి, గ్రామాల్లోకి వస్తుంటాయి. వీటిని చూసిన జనం పరుగులు పెడుతుంటారు. కానీ ఓ వ్యక్తి తన పొలంలోకి వచ్చిన చిరుతతో ప్రశాంతంగా ఫ్రెండ్‌తో దిగినట్టు సెల్ఫీ దిగాడు. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

View this post on Instagram

A post shared by ghantaa (@ghantaa)

ఈ మధ్యకాలంలో చాలా వన్యప్రాణులు గ్రామాల్లోకి వచ్చి అందరినీ హడలెత్తిస్తున్నాయి. ఏనుగులు, ఎలుగుబంట్లు, పాములు, జింకలు, చిరుతలు, పెద్ద పులులు నానా బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటీవల ఓ చిరుత ఫారెస్ట్‌ అధికారిపై దాడి చేసి గాయపర్చింది కూడా. ఇలాంటి టైమ్‌లో పొలంలో ప్రశాంతంగా చిరుతతో సెల్ఫీ దిగుతున్న వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఘంటా అనే యూజర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియోకు ఇప్పటి వరకు లక్షా 69 వేల లైక్‌లు వచ్చాయి.

ఏం గుండెరా వాడిది అంటూ కామెంట్లు:

ఎంతో మంది కామెంట్లు చేస్తున్నారు. అంతటి క్రూర జంతువు సైతం మనిషి దగ్గర ప్రశాంతంగా నిలబడి ఫొటోకు ఫోజులు ఇవ్వడంపై సర్వత్రా విస్మయం చెందుతున్నారు. కొందరు నెటిజెన్లు ఈ వీడియోకి ఎలా స్పందించాలో అర్థం కావడం లేదని కామెంట్లు పెడుతుంటే. మరికొందరు ఏం గుండెరా వాడిది అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇండియా ఫర్‌ నాట్‌ బిగినెర్స్‌ అంటూ గొప్పగా కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే భయం అనే పదం ఇవాళ్టితో చచ్చిపోయింది రా అంటూ కామెంట్‌ చేస్తున్నారు. మరికొందరు వీడియో తీసిన కెమెరామెన్‌ను సైతం పొగడ్తలతో ముంచెత్తున్నారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో భారీ ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోయిస్టులు మృతి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు