Ganesh Nimajjanam: గణేశ్ నిమజ్జనం వద్దని వెక్కి వెక్కి ఏడ్చిన చిన్నారి.. విగ్రహాన్ని హత్తుకుని ఏం చేశాదంటే?

దేశ వ్యాప్తంగా గణేశ్ నిమజ్జన వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. అయితే.. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఉమ్మెద గ్రామంలో నిమజ్జనం సందర్భంగా ఓ చిన్నారి వెక్కివెక్కి ఏడ్చాడు. గణేశ్‌ ప్రతిమను గట్టిగా పట్టుకుని నిమజ్జనానికి ఇవ్వనంటూ మారాం చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో.. ఆ చిన్నారి గణేశుడిపై పెంచుకున్న ప్రేమను తెలియజేస్తోంది.

New Update
Ganesh Nimajjanam: గణేశ్ నిమజ్జనం వద్దని వెక్కి వెక్కి ఏడ్చిన చిన్నారి.. విగ్రహాన్ని హత్తుకుని ఏం చేశాదంటే?

Ganesh Nimajjanam:నిమజ్జనానికి తన దగ్గర ఉన్న గణపతి విగ్రహాన్నీ ఇవ్వను అంటూ చిన్నారి తెగ మారాం చేసింది. గణపతిని తీసుకెళ్లడానికి వచ్చిన ఓ యువకుడికి తన గణపతిని ఇవ్వనంటే ఇవ్వను అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఉమ్మెద గ్రామాంలో చోటుచేసుకున్న ఈ ఘటన పిల్లలు బొమ్మల విషయంలో ఎంత అటాచ్ మెంట్ పెచ్చుకుంటారో తెలియజేస్తుంది. తన దగ్గర ఉన్న చిన్న గణనాధుడికి ఎంతగా కనెక్ట్ అయిందో ఈ వీడియోలో కనిపిస్తోంది.

రక్షిత అనే చిన్నారి చిన్న గణపతి విగ్రహాన్నీ కొనుక్కుంది. ప్రతి రోజు ఆ విగ్రహాంతో ఆడుకుంటూ సందడిగా గడిపేది. చిన్న గణనాధుడితో ఆ చిన్నారి బాగా అటాచ్‌ మెంట్ పెచ్చుకుంది. తన దగ్గర ఉన్న విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు ఏ మాత్రం ఒప్పుకోలేదు. తన గణపతిని తన దగ్గరే పెట్టుకుంటా అంటూ తెగ మారాం చేసింది.అప్పుడే ఓ యువకుడు గణనాధుడి విగ్రహాన్నీ నిమజ్జనం చేసేందుకు ఆ చిన్నారి దగ్గర ఉన్న గణపతి కోసం వచ్చాడు. అయితే, నేను నా గణపతిని ఇవ్వనూ అంటూ ఆ చిన్నారి  గుక్క పట్టి మరి ఏడ్చింది. విగ్రహాం కోసం ఆ యువకుడి  వెంటపడుతున్న  చిన్నారి  పరిగెత్తుతూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయినప్పట్టికి, ఆ యువకుడు చిన్నారిని వదలలేదు. ఇతరుల సహాయంతో చిన్నారి దగ్గర నుండి విగ్రహాన్నీ లాక్కున్నాడు. దీంతో ఆ చిన్నారి వెక్కి వెక్కి ఏడ్చింది. ఆక్కడే ఉన్న స్థానికులు రక్షిత ఎమోషనల్ అయిన సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇది కాస్తా వైరల్ గా మారింది.

చిన్న పిల్లలు ఎక్కువుగా అటాచ్ మెంట్ పెంచుకుంటారు. ముఖ్యంగా ఆట వస్తువులను విపరీతంగా ప్రేమిస్తుంటారు. మరిముఖ్యంగా బొమ్మలను ఎంతగా ఇష్టపడుతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పిల్లలను బయటకి ఎక్కడికైనా తీసుకెళ్తే చాలు ఆ బొమ్మ  కావాలి, ఈ బొమ్మ  కావాలి అని పెరంట్స్ ని విసిగిస్తారు. కొన్ని సార్లు వారు ఆడుకునే వస్తువులు కాస్తా పగిలిపోయిన, ఎవరైనా తీసుకున్న ఏడుస్తూ మారాం చేస్తారు. అయితే, పిల్లలు ఎంతగా అల్లరి చేసినా, ఏడ్చినా చాలా ముద్దుగా అనిపిస్తారు.

Also Read: గంగమ్మ ఒడికి మహాగణపతి.. నిమజ్జనం పూర్తి.. లైవ్ అప్డేట్స్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు