Nirmal: నిర్మల్‌లో దారుణం.. నడిరోడ్డుపై ప్రియురాలిని గొడ్డలితో నరికాడు నిర్మల్ జిల్లాలో దారుణం జరిగింది. ఖానాపూర్ శివాజీ నగర్ లో నడిరోడ్డుపై తన ప్రియులను పెళ్ళికి ఒప్పుకోలేదని గొడ్డలితో నరికి చంపాడు ఓ ప్రేమోన్మాది. అడ్డుకోబోయిన మరో ఇద్దరిపై దాడి చేయగా వారికి గాయాలు అయ్యాయి. By V.J Reddy 08 Feb 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Murder in Nirmal: నిర్మల్ జిల్లాలో దారుణం జరిగింది. ఖానాపూర్ శివాజీ నగర్ లో నడిరోడ్డుపై తన ప్రియురాలిని గొడ్డలితో నరికి చంపాడు ఓ ప్రేమోన్మాది. తనను ప్రేమించి పెళ్లి చేసుకో అనగా ఆ అమ్మాయి ఒప్పుకోకపోవడంతో మనస్థాపానికి గురైన ఆ ప్రేమోన్మాది తనను ప్రేమించి మోసం చేస్తావా అంటూ టైలరింగ్ కు వెళ్లి వస్తున్న ఆ యువతిపై దాడి చేశాడు. అమ్మాయిని గొడ్డలితో నరికి చంపుతుండగా.. అక్కడే ఉన్న ఇద్దరు స్థానికులు ఆపేందుకు ప్రయత్నించగా.. విచక్షణ కోల్పోయిన ఆ కిరాతకుడు వారిద్దరిపై కూడా గొడ్డలితో దాడి చేశాడు. దీంతో వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని దగ్గర లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. పట్టపగలే నడిరోడ్డుపై ప్రియురాలిని గొడ్డలితో నరికి చంపిన ప్రియుడునిర్మల్ - ఖానాపూర్ శివాజీనగర్‌లో పెళ్లికి నిరాకరించిందని అలేఖ్య అనే యువతిని పట్టపగలే ప్రియుడు శ్రీకాంత్ గొడ్డలితో నరికి చంపాడు.. అడ్డుకోబోయిన మరో ఇద్దరిపైనా దాడి చేయడంతో వారికీ గాయాలయ్యాయి. నిందితుడు శ్రీకాంత్… pic.twitter.com/vZphWKFvIH — Telugu Scribe (@TeluguScribe) February 8, 2024 ఆ అమ్మాయి అక్కడే మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆ ప్రేమోన్మాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. #crime-news #murder-news #nirmal-crime-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి