దేశ రాజధాని ఢిల్లీ(Delhi) నగరంలో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది. బరాఖంబా రోడ్డులోని గోపాల్ దాస్ భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. 8 వ అంతస్తులో మంటలు చెలరేగుతున్నాయి. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేపట్టారు.
మంటలు భారీగా వ్యాపించడంతో పాటు..8 వ అంతస్తులో మంటలు రావడంతో ఆ ప్రాంతమంతా పొగలు వ్యాపించాయి. ఈ ప్రమాదం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది వెంటనే 15 ఫైరింజన్లతో చేరుకున్నారు.
మంటలు ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మంటలు ఎక్కువగా రాకముందే బిల్డింగ్ లో ఇతర అంతస్తుల్లో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయిస్తున్నారు. ఈ భవనంలో చాలా వరకు పని కార్యాలయాలే ఉన్నాయి. అసలు అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ప్రాణ నష్టం జరిగినట్లు తెలియలేదు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు సేకరిస్తున్నారు.
Also read: అమెరికాలో విజయవాడ మెడికల్ విద్యార్థిని మృతి..కారణం ఏంటంటే!