Indus Hospital Fire Accident: విశాఖపట్నం జిల్లా (Vishakapatnam) కేంద్రంలోని జగదాంబ జంక్షన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇండస్ ఆస్పత్రిలోని రెండో అంతస్థులో మంటలు చెలరేగడంతో రోగులు భయంతో పరుగులు తీశారు. పలువురు మంటల్లో చిక్కుకోగా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ మేరకు ఆస్పత్రి రెండో అంతస్తులో ఫైర్ అంటుకోగా ఆస్పత్రి ఆవరణలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో సుమారు 40 మంది రోగులను కాపాండేదుకు అద్దలను బ్రేక్ చేసి అంబులెన్స్‌లలో వివిధ ఆస్పత్రులకు తరలించారు. నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దట్టమైన పొగ కారణంగా ఊపిరి సలపక రోగులు ఇబ్బందిపడ్డారు. ఇందులో గాయపడిన సిబ్బందిని సైతం మరో అస్పత్రికి తరలించారు. ఇంకా ఎవరైనా లోపల ఇరుక్కుపోయారో తెలియకపోవడంతో అన్ని గదులను పోలీసులు జల్లెడ పడుతున్నారు. లిఫ్ట్ లోనూ ఇరుక్కుపోయారనేది ఇంకా తెలియరాలేదు.
ఇది కూడా చదవండి : Smirthi Irani:అలా ఎలా అంటారు మేడం.. పీరియడ్ లీవ్ పై సెన్సేషనల్ అవుతున్న స్మృతి వ్యాఖ్యలు
అయితే ఆస్పత్రికి సంబంధించి నాలుగు వైపులు అద్దాలను పగలగొట్టి ప్రతి ఫ్లోర్ ను క్లియర్ గా పరీశీలిస్తున్నారు. పోలీసు సిబ్బంది మొత్తం లోపలికి వెళ్లి క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు. అయితే ఆస్పత్రికి సంబంధించి నాలుగు వైపులు అద్దాలను పగలగొట్టి ప్రతి ఫ్లోర్ ను క్లియర్ గా పరీశీలిస్తున్నారు. పోలీసు సిబ్బంది మొత్తం లోపలికి వెళ్లి క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు. విశాఖ సీపీ రవిశంకర్ ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకోచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ల్యాడర్ సహాయంతో సహాయక చర్యలు చేపడుతున్నారు. విద్యుదాఘాతం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. రోగులను వేరే ఆసుపత్రికి తరలించామని, పొగలు దట్టంగా వ్యాపించడంతో గందరగోళం ఏర్పడిందన్నారు. ఎవరికీ గాయాలు అయినట్లు సమాచారం లేదని,
12 ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపు చేస్తు్న్నట్లు వెల్లడించారు.
ఇక ఈ ప్రమాదంపై స్పందించిన ఆస్పత్రి వర్గాలు ఎవరికి ఏమీ జరగలేదని, అందరినీ జాగ్రత్తగా బయటకు పంపించినట్లు తెలిపారు. రెండో అంతస్థు ఆపరేషన్ థియేటర్ లో ఇది జరగినట్లు తెలుస్తుందని తహసిల్దార్ చెప్పారు. బహుశా ఇది షార్ట్ సర్కూట్ అయి ఉంటుందని, దీనిపై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఈ ఘటనకు షార్ట్ సర్క్యూట్ కారణమనే కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.