/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Death-jpg.webp)
నల్గొండ వేదికగా మంగళవారం బీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన సభ.. ఓ కుటుంబంలో విషాదం నింపింది. సభకు వెళ్లి తిరుగు ప్రయాణంలో వస్తుండగా.. ఓ కారు పల్టీలు కొట్టి విధులు నిర్వహిస్తున్న పోలీసులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ హోంగార్డు మృతిచెందగా.. మరో హోంగార్డు గాయపడ్డాడు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కంటోన్మెంట్ ఎమ్మె్ల్యే లాస్య నందిత కూడా ప్రమాదం బారిన పడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ ఆటో ఢీకొనడంతో నందిత గాయపడ్డారు. అయితే తాను సురక్షితంగా బయటపడ్డట్లు ఎక్స్‌లో తెలిపింది.
Also Read: హైదరాబాద్ జోలికొస్తే మిమ్మల్ని వదలం.. ఏపీ నాయకులకు తెలంగాణ నేతలు వార్నింగ్
చర్లపల్లి వద్ద
ఇకవివరలాల్లోకి వెళ్తే.. బహిరంగ సభ పూర్తయ్యాక అక్కడికి వచ్చిన వారు వెనుదిరిగారు. అయితే ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్న సమయంలో ఓ కారు అదుపుతప్పి చర్లపల్లి వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులను ఢీకొట్టి బొల్తా పడింది. ఈ ప్రమాదంలో నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన హోంగార్డు కిషోర్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మరో హోంగార్డుకు తీవ్ర గాయాలయ్యయి. దీంతో బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, పోలీస్ అధికారులు గాయపడిన హోంగార్డును ఆసుపత్రికి తరలించారు.
నేను క్షేమంగా ఉన్నా
ఇదిలాఉండగా.. కేసీఆర్ ప్రసంగం ముగిసిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత తన కారులో తిరుగు ప్రయాణమయ్యారు. అయితే మార్గమధ్యలో నార్కట్‌పల్లి సమీపంలో చర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ ఆటో ఢీకొంది. దీంతో ఆమె కారు ముందు భాగం ధ్వంసం అయ్యింది. కారు టైరు బయటకు వచ్చింది. ఈ ఘటన జరిగిన అనంతరం.. ' నేను సురక్షితంగా ఉన్నాను.. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని' ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Was involved in an accident on the way back from Nalgonda. I'm okay, and there's nothing to worry about. Grateful for everyone's concern and support pic.twitter.com/rf1strjVPs
— G Lasya Nanditha (@glasyananditha) February 13, 2024
Also Read: తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీదే జోరు.. టైమ్స్ నౌ సంచలన సర్వే