ఇంట్లోకి ఈగలు రాకుండా ఉండేందుకు అద్భుతమైన చిట్కా

వర్షాకాలం వచ్చేసిందనుకుంటే వారం రోజులు నాన్‌స్టాప్‌గా భారీగా వర్షాలు కురిసి మళ్లా పత్తా లేకుండా పోయాయి. కానీ వానలకంటే వేగంగా ఇంట్లోకి ఈగలు ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. మీరూ ఇదే సమస్యతో ఇబ్బంది పడుతుంటే మాత్రం ఈగలను తరిమికొట్టడానికి ఏం చేయాలో, ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం.

New Update
ఇంట్లోకి ఈగలు రాకుండా ఉండేందుకు అద్భుతమైన చిట్కా

మన ఇళ్లలో తిరిగే ఈగలు సాధారణంగా శుభ్రత లేని ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. చెత్తా చెదారం ఉన్న ప్రాంతాల్లో.. రోడ్లపై పండ్లు తినేటప్పుడు ఈగలు ఆ పండ్ల చుట్టూ ముసురుకుంటాయి. కొన్నిసార్లు శుభ్రంగా ఉన్న చోట కూడా ఈగలు ముసురుకుంటాయి. అంతేకాదు ఈగలు లేనిపోని అంటు వ్యాధులను తనతో పాటుగా తీసుకొస్తాయి. దీనికారణంగా కలరా, విరేచనాలు, టైఫాయిడ్, అతిసారం, డెంగ్యూ వంటి రోగాలు వస్తాయి. ఇంటిని ఎన్నిసార్లు శుభ్రం చేసుకున్నా, తలుపులకు, కిటికీలకు నెట్ కట్టుకుని ఎన్ని జాగ్రత్తలు పాటించినా సరే ఈగలు మాత్రం తగ్గేదేలేదంటూ ఇంట్లోకి వచ్చేస్తుంటాయి.

ఆల్ట్రా వయోలెట్ ట్రాప్స్:

ఈగలను తరిమికొట్టడానికి చాలా బాగా పనిచేస్తాయి. ఇంట్లోని ఈ ఆల్ట్రా వయోలెట్ ఈగలను బాగా ఆకర్షిస్తాయి. అలా వాటి వద్దకు వెళ్లిన ఈగలు షాక్ తో చనిపోతాయి. అలా ఈగల బెడద తగ్గిపోతుంది.

A-great-tip-to-keep-flies-out-of-the-house

కర్పూరం:

A-great-tip-to-keep-flies-out-of-the-house

కర్పూరానికి ఘాటైన వాసన ఉంటుంది. ఈ వాసనతోనే ఈగలను తరిమికొట్టవచ్చు. ఈగలు ఎక్కువగా ఉన్నట్లయితే కర్పూరం చక్కగా పని చేస్తుంది. కర్పూరాన్ని వెలిగించి ఈగలను దూరం చేయవచ్చు.

తులసి:

A-great-tip-to-keep-flies-out-of-the-house

తులసిలో ఎన్నో ఔషధగుణాలు ఉన్న విషయం తెలిసిందే. ఔషధపరంగా, ఆధ్యాత్మికపరంగా తులసికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాగే తులసి ఆకులతో ఈగలను తరిమికొట్టవచ్చు. పుదీనా, లావెండర్, మ్యారీగోల్డ్ మొక్కలు కూడా ఈగలను తరిమికొడతాయి.

గ్రీన్ ఆపిల్ సోప్:

A-great-tip-to-keep-flies-out-of-the-house

గ్రీన్ ఆపిల్ లిక్విడ్ సోప్ ఈగలను తరిమికొడుతుంది. చిన్న జార్ లో రెండు టీస్పూన్స గ్రీన్ ఆపిల్ లిక్విడ్ సోప్ వేసి అందులో కొన్ని నీళ్లు పోసి ఓ మూలన ఉంచాలి. గ్రీన్ ఆపిల్ లిక్విడ్ సోప్ ఘాటైన వాసన వల్ల ఈగలు రావు.

ఆపిల్ సైడర్ వెనిగర్:

A-great-tip-to-keep-flies-out-of-the-house

ఈగలు రాకుండా నివారించడానికి ఇది చాలా ఉత్తమమైన మార్గం. ఒక చిన్న గిన్నెలో ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకోవాలి. దానిని ఇంట్లోని ఓ మూలలో ఉంచడం వల్ల ఆ ఘాటైన వాసనకు ఈగలు అటు వైపుకు రావు.

వైట్ వైన్:

A-great-tip-to-keep-flies-out-of-the-house

డిష్ వాషింగ్ లిక్విడ్ తో వైట్ వైన్ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక చిన్న గిన్నెలో వేసుకోవాలి. ఇది ఈగలను ఆకర్షిస్తుంది. అలా ఈ గిన్నెపై వాలిన ఈగలు చనిపోతాయి.

దాల్చిన చెక్క:

A-great-tip-to-keep-flies-out-of-the-house

దాల్చిన చెక్క పొడి మంచి ఫ్లై రిపెల్లెంట్‌గా పని చేస్తుంది. దాల్చిన చెక్కను ఎయిర్ రిఫ్రెషనర్‌గా ఉపయోగించవచ్చు. ఈగలకు దాల్చిన చెక్క వాసనను ఇష్టపడవు. దాంతో ఇంట్లోకి ఈగలు రావు. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.

Advertisment
తాజా కథనాలు