అక్రమ సంబంధం మోజులో దారుణం.. భార్య, రెండేళ్ల కూతురును పాముతో కరిపించి

అక్రమం సంబంధం మోజులో కట్టుకున్న భార్య, కన్నబిడ్డపట్ల కర్కశంగా వ్యవహరించాడు ఓ దుర్మార్గుడు. తల్లి తమ రెండేళ్ల పాపతో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా వారిద్దరిని పాము కాటుకు గురిచేసి ప్రాణాలు తీశాడు. ఈ దారుణమైన ఘటన ఒడిశాలో చోటుచేసుకోగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అక్రమ సంబంధం మోజులో దారుణం.. భార్య, రెండేళ్ల కూతురును పాముతో కరిపించి
New Update

ఈ మధ్య కాలంలో కన్నబిడ్డలపైనే దారుణానికి పాల్పడుతున్నారు తల్లిదండ్రులు. కొంతమంది తండ్రులు కామాంధులుగా మారి కన్నవారినే కాటేస్తుంటే మరికొందరు క్షణికావేశంలో పసిపిల్లల ప్రాణాలు తీస్తున్నారు. ఇటీవలే ఓ తండ్రి తన ఇద్దరు మైనరు కొడుకుల గొంతుకోసి చంపిన ఘటన మరవకముందే రెండేళ్ల కూతురు, భార్యను పాము కాటుకు గురిచేసి కన్నుమూసేలా చేశాడు ఓ దుర్మార్గుడు.

ఈ మేరకు ఒరిస్సాలోని గంజమ్‌ జిల్లా కబీర్ సూర్యనగర్‌ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కబీర్ సూర్యనగర్‌ స్టేషన్‌ పరిధిలోని అధీబరా గ్రామంకి చెందిన గణేష్ పాత్ర (25) , బసంతి పాత్ర (23)లకు 2020లో పెళ్లిచేసుకున్నారు. వారికి రెండేళ్ల కూతురు ఉంది. అయితే కొంతకాలం సజావుగానే సాగినా వైవాహిక జీవితంలో గొడవలు మొదలయ్యాయి. గణేష్‌ ఇతర మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భార్య బసంతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో భార్యపిల్లలను అడ్డుతొలగించుకోవాలని అనుకున్నాడు గణేష్‌. ఈ క్రమంలో వీరి హత్యకు పథకం వేసి.. సెప్టెంబర్ 26న గణేష్ తన తండ్రి పేరుతో సిమ్ కార్డును కొన్నాడు. శివాలయంలో మతపరమైన ఆచారాలు జరుపుకోవాలనే సాకుతో పాముల బసంత ఆచార్య అనే మంత్రగాడి నుంచి అక్టోబర్ 6న పామును కొని ఇంటికి తీసుకొచ్చాడు. ప్లాస్టిక్‌ జార్‌లో పామును తెచ్చాడు. అందుకు కొత్త సిమ్‌ను వినియోగించాడు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో భార్య బసంతి పాత్ర (23), కుమార్తె దేబస్మిత (2) నిద్రిస్తున్న గదిలో పామును విడిచిపెట్టాడు. మరుసటి రోజు ఉదయం నాటికి పాము కాటుకు గురై తల్లి, కూతురు అపస్మారక స్థితిలో కనిపించారు. ఈ సంఘటన ఈ ఏడాది అక్టోబర్‌ 7వ తేదీన చోటుచేసుకుంది.

Also read :బర్రెలక్క పిటిషన్ పై హైకోర్టులో విచారణ

అయితే తెల్లారిన తర్వాత ఏమీ ఎరగనట్టు తన భార్య, కూతురు అస్వస్థతకు గురయ్యారని గణేష్‌ నంగనాచి ఏడుపు మొదలెట్టాడు. విషయం తెలుసుకున్న భార్య బసంతి తల్లిదండ్రులతోపాటు ఇరుగు పొరుగు వారి ఇంటికి చేరుకుని, తల్లీకూతుళ్లను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. పోస్టుమార్టం రిపోర్టులో పాముకాటు వల్లే తల్లీకూతుళ్లు మృతి చెందినట్లు నిర్ధారించారు. బసంతి తండ్రి.. అల్లుడిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో అసలు నిందితుడు గణేష్‌గా తేల్చారు. ఈ సంఘటన జరగడానికి ముందు 3 నెలల ముందు నుంచి మాత్రమే వీరు మళ్లీ కలిసి ఉంటున్నారని ఎస్పీ జగన్మోషన్‌ మీనా వివరించారు. మొదట అసహజ మరణంగా కేసు నమోదు చేసుకున్నప్పటికీ.. ఆ తర్వాత నేరం నిరూపించేందుకు సరైన ఆధారాలు లేకపోవడంతో నిందితుడిని అరెస్ట్ చేయడం ఆలస్యమైందని ఎస్పీ తెలిపారు. గణేష్, అతని భార్య కె బసంతి పాత్ర మధ్య వైవాహిక విభేదాలు ఈ సంఘటనకు దారితీసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

#wife #daughter #snakebite
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe