Viral Video: లక్కీ బాయ్.. బాలయ్యకు దండేసి దండంపెట్టిన అభిమాని.. వీడియో వైరల్!

నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ.. ఓ అభిమాని ప్రేమను అప్యాయంగా స్వీకరించిన వీడియో వైరల్ అవుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పూల దండవేసి దండం పెట్టిన వ్యక్తిని ప్రేమగా హత్తుకున్న బాలయ్య తీరుపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. లక్కీ బాయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

New Update
Viral Video: లక్కీ బాయ్.. బాలయ్యకు దండేసి దండంపెట్టిన అభిమాని.. వీడియో వైరల్!

Balakrishna: టాలీవుడ్ సీనియర్ హీరో, టీడీపీ ఇందుపురు ఎమ్మెల్యే బాలకృష్ణకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారంలో పాల్గొంటున్న బాలకృష్ణకు మద్ధతుగా భారీ ఎత్తున్న పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చారు. ఈ క్రమంలోనే కారుపై నిలబడి అభివాదం చేస్తుండగా గుంపులో నుంచి బాలయ్య అభిమాని వేగంగా పరిగెత్తుకొచ్చి అభిమాన హీరో మెడలో పూల దండవేసి దండంపెట్టాడు.

ఇది కూడా చదవండి: IVF: పుట్టకముందే మరణం.. ఇజ్రాయేల్‌ దాడిలో లక్షలాది పిండాలు, అండాలు ఛిద్రం!

అప్యాయంగా హత్తుకుని..
ఈ క్రమంలో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ బాలయ్య.. వెంటనే తేరుకుని అతనితో దండ వేయించుకోవడంతోపాటు ఆప్యాయంగా హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. ఫన్నీ కామెంట్స్ పేలుతున్నాయి. ఎవరైనా ఫొటో సెల్ఫీ కోసం దగ్గరకు వస్తే దురుసుగా ప్రవర్తిస్తూ విసుక్కునే బాలయ్య ప్రేమగా దగ్గరకు తీసుకోవడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 'అతన్ని రెండు వేస్తాడనున్నాం. కానీ లక్కీ బాయ్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు