New Update
IND vs ENG Test Match: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం (Uppal Stadium) వేదికగా జరుగుతున్న ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది.టాస్ గెలుచుకుని ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 246 పరుగులకు ఆలౌటైంది.
గ్రౌండ్ లోకి దూసుకొచ్చిన రోహిత్ శర్మ అభిమాని
ఆట రసవత్తరంగా సాగుతోన్న టైంలో ఒక్కసారిగా షాక్ అయ్యే సంఘటన జరిగింది. టీమ్ ఇండియా బ్యాటింగ్ స్టార్ట్ అవ్వగానే...గ్రౌండ్ లోకి ఒక్కసారిగా రోహిత్ శర్మ అభిమాని దూసుకువచ్చి రోహిత్ శర్మ (Rohit Sharma) కాళ్ళు మొక్కే ప్రయత్నం చేయగా రోహిత్ వద్దని వారించడం జరిగింది. ఈ ఘటనతో అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది స్టేడియంలోకి పరుగున వచ్చి ఆ యువకుడిని లాక్కెళ్లారు.
This browser does not support the video element.
పటిష్టమైన భద్రత ఉన్నాసరే ..
భద్రతా ఏర్పాట్లలో భాగంగా స్టేడియంతో పాటు పరిసర ప్రాంతాల్లో 360 సీసీ కెమెరాలు అరేంజ్ చేయడంతో పాటు సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేసామని,1500 మంది పోలీసులతో మ్యాచ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా ఆక్టోపస్ బలగాలను రంగంలోకి దించుతున్నామని ,100 షీ టీమ్స్ మఫ్టీ లో ఉంటారని రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించిన సంగతి తెల్సిందే. భారీ భద్రతా ఏర్పాట్ల నడుమ ఈ మ్యాచ్ జరుగుతూ ఉండటంతో ఈ ఘటన జరగడం అక్కడ సిబ్బందిలో ఒక్కసారి అవాక్కయ్యారు.
దూకుడు పెంచిన యశస్వి జైస్వాల్
ఇక.. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal), రోహిత్ శర్మ క్రీజ్లోకి వచ్చారు. భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించి మొదటి ఓవర్ మార్క్ వుడ్ బౌలింగ్లో ఫస్ట్ బాల్ కే ఫోర్ కొట్టి తన దూకుడు చూపించాడు. ఆ తరువాత రెండో ఓవర్లోను హార్ట్ బౌలింగ్లో జైస్వాల్ రెండు సిక్సులు కొట్టి మ్యాచ్ హీట్ పెంచాడు.
Advertisment