Pakistan: పాకిస్థాన్‌లో సంకీర్ణ ప్రభుత్వం.. కుదిరిన పార్టీల మధ్య ఒప్పందం?

పాకిస్థాన్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతున్నట్లు తెలుస్తోంది. ‘పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌- నవాజ్‌’, ‘పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ'ల మధ్య సయోద్య కుదిరినట్లు సమచారం. పాక్ ను రాజకీయ అనిశ్చితి నుంచి గట్టెక్కించేందుకు ఇరు పార్టీలు సిద్ధంగా ఉన్నట్లు పీఎంఎల్‌-ఎన్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

Pakistan: పాకిస్థాన్‌లో సంకీర్ణ ప్రభుత్వం.. కుదిరిన పార్టీల మధ్య ఒప్పందం?
New Update

Pakistan Election Result 2024: పాకిస్థాన్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ (Nawaz Sharif) నేతృత్వంలోని ‘పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌- నవాజ్‌ (PML-N)’ పార్టీ ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాదు ‘పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (PPP)’తో జరిపిన చర్చలు సఫలమైనట్లు సమాచారం. కాగా పీపీపీ ఛైర్మన్‌ బిలావల్‌ భుట్టో జర్దారీ (Bilawal Bhutto Zardari), అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీతో (Asif Ali Zardari) తమ అధ్యక్షుడు షెహబాజ్‌ షరీఫ్‌ చాలా అంశాలపై జరిపిన చర్చలు కొలిక్కి వచ్చినట్లు పీఎంఎల్‌-ఎన్‌ తెలిపింది.

సూత్రప్రాయంగా అంగీకారం..
ఈ మేరకు ‘రాజకీయ అనిశ్చితి నుంచి పాకిస్థాన్ ను కాపాడేందుకు ఇరు పార్టీల మధ్య సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది’ అని పీఎంఎల్‌-ఎన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే త్వరలో జరగబోయే సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో పీపీపీ (PPP) నాయకత్వం తమ ప్రతిపాదనలను తమముందుకు తీసుకురానున్నట్లు పీఎంఎల్‌-ఎన్‌ (PML-N) ప్రకటన రిలీజ్ చేసింది. అంతేకాదు దేశంలో నెలకొన్న పరిస్థితిని పూర్తిగా సమీక్షించి, ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అనిశ్చితిని తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఇది కూడా చదవండి : Karimnagar: దేవుడిని నమ్మని వాళ్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఓటేయండి.. బండి సంచలన కామెంట్స్

ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు..
అలాగే భవిష్యత్‌లో రాజకీయ సహకారంపై కూడా క్లుప్తంగా చర్చించినట్లు పేర్కొంది. ఈ ఎన్నికల్లో మెజారిటీ ప్రజలు తమ మద్ధతుగా నిలిచారని చెప్పింది. పీఎంఎల్‌-ఎన్‌తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించినట్లు పీపీపీ సైతం వెల్లడించింది. ఈ మేరకు పాకిస్థాన్‌ ఎన్నికల సంఘం రిలీజ్ చేసిన ఫైనల్ రిజల్ట్ ప్రకారం.. 265 జాతీయ అసెంబ్లీ సీట్లకు జరిగిన ఎన్నికల్లో పీఎంఎల్‌-ఎన్‌ 75 దక్కించుకుంది. ఇమ్రాన్‌ (Imran Khan) సారథ్యంలోని పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ (PTI) పార్టీ నుంచి స్వతంత్రులుగా పోటీచేసిన అభ్యర్థులు అత్యధికంగా 101 స్థానాల్లో గెలుపొందారు.

రెండు పార్టీలు కలిస్తేనే..
అయితే పీఎంఎల్‌-ఎన్‌ అధికారంలోకి రావాలంటే 54 సీట్లలో విజయం సాధించిన పీపీపీ మద్దతు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రెండు పార్టీలు కలిస్తే 129 సీట్లు అవుండగా.. 17 సీట్లు నెగ్గిన ఎంక్యూఎం-పీతోనూ నవాజ్‌ షరీఫ్‌ చర్చలు జరుపుతున్నట్లు సమచారం. ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు 133 సీట్లు కావాల్సివుండగా.. ఈ మూడు పార్టీలు కలిస్తేనే ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యమవుతుంది. అయితే వారితో దోస్తికి ఎంక్యూఎం-పీ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో మరింత ఆసక్తికరంగా మారింది పాక్ రాజకీయం.

#pti #pakistan #pml-n #ppp #coalition-government
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి