Case on Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కేసు నమోదు!

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై పోలీసు అసోసియేషన్ సీరియస్ అయ్యింది. దీంతో ఆయనపై నాగర్ కర్నూల్ పోలీసు స్టేషన్లో పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోవర్ధన్ పట్వారి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. కాగా, పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆయన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ ఇస్తున్న పోలీసుల పేర్లు రెడ్ డైరీలో రాసి పెట్టుకుంటామని.. కాంగ్రెస్ రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి మిత్తితో సహా కలిపి ఇస్తామన్నారు...

New Update
Case on Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కేసు నమోదు!

Case on Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై పోలీసు అసోసియేషన్ సీరియస్ అయ్యింది. దీంతో ఆయనపై నాగర్ కర్నూల్ పోలీసు స్టేషన్లో పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోవర్ధన్ పట్వారి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్ లపై కూడా నాగర్ కర్నూల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇంతకీ రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..

రేవంత్ రెడ్డి సమక్షంలో సోమవారం మహబూబ్ నగర్ జిల్లా నేతలు కొందరు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ లో పోలీసుల తీరును తప్పుబట్టారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ ఇస్తున్న పోలీసుల పేర్లు రెడ్ డైరీలో రాసి పెట్టుకుంటామని.. కాంగ్రెస్ రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి మిత్తితో సహా కలిపి ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి. దీంతో ఈ వ్యాఖ్యలపై పోలీసు అసోసియేషన్ మండిపడుతోంది.

Advertisment
తాజా కథనాలు