/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Rakshit-Shetty.jpg)
Rakshit Shetty: కన్నడ నటుడు, నిర్మాత రక్షిత్ శెట్టిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ‘బ్యాచిలర్ పార్టీ’ కోసం రక్షిత్ తమ పాటలను కాపీ కొట్టారని ఎంఆర్‌టీ మ్యూజిక్ కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘న్యాయ ఎల్లిదే’, ‘గాలిమాతు’ చిత్రాల్లోని పాటలను రక్షిత్, ఆయనకు చెందిన నిర్మాణసంస్థ పరంవా స్టూడియోస్ ‘బ్యాచిలర్ పార్టీ’లో కాపీ కొట్టారని . ఫిర్యాదులో పేర్కొంది.
తమ అనుమతి లేకుండా చేయడం సరైన పద్ధతి కాదని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. కాగా ఆ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో దీనిపై వివరణ ఇవ్వాలని నటుడు రక్షిత్ కు నోటీసులు ఇచ్చారు