K. E. Gnanavel Raja : పని మనిషికి వేధింపులు.. 'సింగం' నిర్మాతపై కేసు నమోదు!

ఇంటి పని మనిషిని వేధించిన కేసులో సినీ నిర్మాత జ్ఞానవేల్ రాజాపై కేసు నమోదైంది. జ్ఞానవేల్ భార్య నేహా కారణంగానే తమ ఇంట్లో విధులు నిర్వర్తించే మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు కేసు ఫైల్ చేసినట్లు తెలిపారు.

New Update
K. E. Gnanavel Raja : పని మనిషికి వేధింపులు.. 'సింగం' నిర్మాతపై కేసు నమోదు!

Chennai : ఇంటి పని మనిషిని వేధించిన కేసులో సినీ నిర్మాత జ్ఞానవేల్ రాజా(Gnanavel Raja) పై కేసు నమోదైంది. జ్ఞానవేల్ భార్య నేహా(Neha) కారణంగానే తమ ఇంట్లో విధులు నిర్వర్తించే మహిళా ఆత్మహత్యాయత్నం(Suicide) చేసుకున్నట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు జ్ఞానవేల్, నేహాలపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: Salman khan: కాల్పుల ఎఫెక్ట్.. ఇల్లు మారుతున్న సల్లుభాయ్!

అసలేం జరగిందంటే..
చెన్నైలోని త్యాగరాయ నగర్‌లోని జగదీశ్వరన్ వీధిలో నిర్మాత జ్ఞానవేల్ రాజా, భార్య నేహా ఉంటున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం తమ ఇంట్లో కొన్ని బంగారం ఆభరణాలు కనిపించకుండా పోయాయి. దీంతో పని మనిషి లక్ష్మిని ప్రశ్నించింది నేహా. దీంతో మనస్థాపం చెందిన లక్ష్మి పనికి రావడం మానేసింది. ఫోన్ కూడా స్విచ్ఛ్ ఆఫ్ చేసుకుంది. దీంతో మరింత అనుమానం పెంచుకున్న నేహా.. లక్ష్మి ఇలా చేసిందంటూ భర్తకు వివరించింది నేహా. దీంతో వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు జ్ఞానవేల్. అయితే లక్ష్మిని విచారణకు పిలవగా.. పరువు పోయినట్లు భావించిన లక్ష్మి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు ఆమె కూతురు నిర్మాత జ్ఞానవేల్, నేహాపై పోలీసులకు కంప్లైట్ చేయగా కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు