Raj Tarun Lover Lavanya : సినీ నటుడు రాజ్ తరుణ్‌పై కేసు నమోదైంది. తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు 420, 506, 493 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు రాజ్‌తరుణ్‌తో తనకు పదేళ్ల క్రితమే పెళ్లి జరిగిందని, కొన్నాళ్లు ఇద్దరు కలిసే జీవించగా గతంలో ఒకసారి అబార్షన్ కూడా చేయించాడంటూ లావణ్య పలు ఆధారాలు సమర్పించడంతో కేసు ఫైల్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
'మేము ఇద్దరం 2012 నుంచి రిలేషన్లో ఉన్నాం. కానీ కొద్ది రోజులుగా మరో సినీనటితో సన్నిహితంగా ఉంటున్నాడు. ‘తిరగబడర సామీ’ సినిమా షూటింగ్ జరిగినప్పటి నుంచి ఈ రిలేషన్ కొనసాగిస్తున్నారు. దీనిపై నిలదీస్తే నన్ను బూతులు తిట్టాడు. బెదిరింపులకు పాల్పడ్డాడు. నాకు సంబంధం లేని ఓ కేసులో ఇరికించి 43 రోజులు జైలుపాలు చేశాడు. మాకు పదేళ్ల క్రితమే మ్యారేజ్ అయింది. ఇద్దరం కలిసి విదేశాలకు కూడా వెళ్లాం. కొన్నాళ్ల క్రితం నాకు అబార్షన్ చేయించాడు' అంటూ లావణ్య ఫిర్యాదులో వివరంగా పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు.