Bigg Boss: నేను మీ మేకలోన్ని అన్నా.. బిగ్‍బాస్‍కు పంపించండన్నా.. మరో మట్టిబిడ్డ వీడియో వైరల్

అన్నా.. నేను మీ రైతు బిడ్డనన్నా.. అంటూ వీడియోలు చేస్తూ బిగ్ బాస్ కు వెళ్లిన ప్రశాంత్ టైటిల్ గెలిచి సంచలనం సృష్టించాడు. దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న కొంత మంది తామూ వెళ్తామంటూ వీడియోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ బాలుడు చేసిన వీడియో నెట్టింట్లో దుమ్ములేపుతోంది.

New Update
Bigg Boss: నేను మీ మేకలోన్ని అన్నా.. బిగ్‍బాస్‍కు పంపించండన్నా.. మరో మట్టిబిడ్డ వీడియో వైరల్

Bigg Boss viral Video: ఒకప్పుడు బిగ్ బాస్ అంటే కేవలం సెలెబ్రెటీలు మాత్రమే వెళ్తారు. వాళ్ళు మాత్రమే టైటిల్ గెలుస్తారు అనే భావన ఉండేది. ఒకవేళ బిగ్ బాస్ కు కామన్ వెళ్లిన కొన్ని వారాలు మాత్రమే ఉంటారని ప్రేక్షకులు అనుకుంటారు. కానీ బిగ్ బాస్ చరిత్రలో మొదటి సారి ఒక కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచి సంచలనం సృష్టించాడు.

నేను మీ రైతు బిడ్డను... మళ్లొచ్చిన.. అన్నా నన్ను బిగ్ బాస్ హౌస్ కు తీసుకెళ్లండి అన్నా అంటూ వీడియోలు చేసిన పల్లవి ప్రశాంత్ సీజన్ 7 లో అడుగు పెట్టి బిగ్ బాస్ కు వెళ్లాలనే తన కోరికను నెరవేర్చుకున్నారు. వెళ్లడమే కాదు పట్టుదలతో ఆడి ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను గెలిచి విజేత అయ్యాడు. బిగ్ బాస్ టైటిల్ గెలవడం సామాన్యులకు అసాధ్యమేమీ కాదని నిరూపించాడు ప్రశాంత్. గత సీజన్స్ లో కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చిన కంటెస్టెంట్స్ కొన్ని వారాలు మాత్రమే బిగ్ బాస్ ఇంట్లో ఉండగలిగారు. మొదటి సారి ఒక కామన్.. రైతు బిడ్డ టైటిల్ గెలవడం ఎంతో మంది సామాన్యులకు స్ఫూర్తిగా నిలిచింది.

రైతు బిడ్డగా వీడియోలు చేస్తూ.. బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లిన ప్రశాంత్ ను ఎంతో మంది సామాన్యులు స్ఫూర్తిగా తీసుకున్నారు. ప్రశాంత్ బిగ్ బాస్ లో ఉన్నప్పటి నుంచి కొంత మంది తాము కూడా బిగ్ బాస్ వెళ్లాలనే కోరికను తెలియజేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించి మేకలు కాస్తున్న ఒక చిన్న అబ్బాయి నన్ను బిగ్ బాస్ షోకు పంపించండి అంటూ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. "అన్నా నేను మీ మేకలోనన్న నన్ను బిగ్ బాస్ కు పంపండి అన్న.. చిన్న పిల్లాడి కోరిక తీర్చకపోతే ఎట్లన్న అంటూ మాట్లాడుతున్నాడు". మరి రైతు బిడ్డకు అవకాశం వచ్చినట్లే.. ఈ అబ్బాయి కూడా బిగ్ బాస్ కు అవకాశం వస్తుందేమో చూడాలి. బిగ్ బాస్ కు వెళ్లాలనే ఆ అబ్బాయి కోరిక ఫలించాలని ఆశిద్దాం.

Also Read: Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ ఈ పాత వీడియో మీకు గుర్తుందా.. బిగ్ బాస్ తర్వాత మరో సారి ట్రెండింగ్!

Advertisment
Advertisment
తాజా కథనాలు