ఛత్తీస్‌గఢ్ బీజేపీ నేత రతన్ దూబే శనివారం నారాయణపూర్ జిల్లాలో నక్సలైట్ల చేతిలో హతమయ్యారు. నవంబర్ 7న జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ తొలి దశ ఎన్నికలకు మూడు రోజుల ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. నారాయణపూర్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న దూబే కౌశల్‌నార్ గ్రామంలో పార్టీ తరపున ప్రచారం చేస్తుండగా హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దూబేపై గుర్తు తెలియని నక్సలైట్లు పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేసినట్లు వెల్లడించారు.
నక్సలైట్ల ఈ పిరికిపంద చర్యను పార్టీ మొత్తం ఖండిస్తోందని బీజేపీ నేత ఓం మాథుర్ తన సందేశంలో పేర్కొన్నారు. నారాయణపూర్‌లో బీజేపీ నాయకుడి హత్యపై, బీజేపీ ఎమ్మెల్యే బ్రిజ్‌మోహన్ అగర్వాల్ మాట్లాడుతూ, “బీజేపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని హత్యలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం మొహ్లా-మన్‌పూర్‌లో జరగ్గా, ఈరోజు నారాయణపూర్‌లో జరిగింది. రాజకీయ కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించకపోవడం విచారకరమన్నారు. శాంతిభద్రతలను తన చేతుల్లోకి తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని అభ్యర్థిస్తామని తెలిపారు. అంతకుముందు అక్టోబర్ 20న మోహ్లా-మాన్‌పూర్-అంబగఢ్ చౌకీ జిల్లాలోని సర్ఖేడా గ్రామంలో బీజేపీ కార్యకర్త బిర్జు తారామ్‌ను మావోయిస్టులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: ఈ తెల్లటి పువ్వులతో…హైబీపీ ఈజీగా తగ్గిపోతుంది..!!
నవంబర్ 7న ఓట్లు:
కాగా నవంబర్ 7న ఎన్నికలు జరగనున్న 20 అసెంబ్లీ స్థానాల్లో ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ ఒకటి. అదే సమయంలో, ఛత్తీస్‌గఢ్‌లోని 90 మంది సభ్యుల అసెంబ్లీకి రెండో దశ ఓటింగ్ నవంబర్ 17న జరగనుండగా, ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరుగుతుంది. గతంలో బీజేపీ నాయకుడి హత్య సంచలనం సృష్టించగా, ఈ నక్సలైట్ల ఘటన కూడా పలు ప్రశ్నలను లేవనెత్తింది.
ఇది కూడా చదవండి: తులసి..సర్వరోగనివారిణి.. ఈ మొక్క వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసుకోండి!