Uttarkhand: నైనిటాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి

ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ జిల్లాలోని ఓఖల్ కండ బ్లాక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిన్న సాయంత్రం అక్కడ ఓ వాహనం 200లోయలో పడిపోవడంతో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

New Update
Uttarkhand: నైనిటాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి

Accident In Nainital:నైనిటాల్‌లో హల్ద్వానీ నుంచి ఓఖల్‌కండ బ్లాక్‌లోని పూదపురి గ్రామానికి బ్యాక్స్‌ వ్యాన్‌లో 12మంది ప్రయాణం చేస్తున్నారు. ఈ క్రమంలో వాహనం అదుపు తప్పి పాట్లోట్ దగ్గరలో 200 అడుగుల లోతులోకి పడిపోయింది. ఇందులో ఆరుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని వెంటనే దగ్గరలో ఉన్న హల్ద్వానీ స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో పుర్పూరికి చెందిన భువన్ చంద్ర భట్ (30), మమత (19), భద్రకోట్ నివాసి ఉమేష్ పర్గై (38) ఉన్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే నైనిటాల్ పోలీసులు, రెస్క్యూ టీమ్ సంఘటాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగించారు. మృతదేహాలకు ప్యాట్‌లాట్‌లోనే పోస్టుమార్టం ప్రక్రియ చేశారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన మహేశ్‌ చంద్ర, ఆయన భార్య పార్వతీదేవి, కుమార్తె కవిత మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

also Read:Andhra Pradesh: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీ మార్పు

Advertisment
తాజా కథనాలు