Crime : తల్లి అయిన 9వ తరగతి బాలిక.. 2.2కేజీల శిశువు జననం

9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక బిడ్డకు జన్మనివ్వడం దేశవ్యాప్తంగా చర్చనీయాశంమైంది. బాగేపల్లి బాలికల సంక్షేమ శాఖ హాస్టల్‌లో ఉంటున్న ఆమె తీవ్ర కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరగా అసలు విషయం బయటపడింది. హాస్టల్‌ వార్డెన్, సిబ్బందిపై కేసులు నమోదు చేశారు.

Crime : తల్లి అయిన 9వ తరగతి బాలిక.. 2.2కేజీల శిశువు జననం
New Update

Crime : కర్ణాటక రాష్ట్రంలో మరో అమానుష ఘటన దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. పద్నాలుగేళ్ల వయసులోనే గర్భం దాల్చిన ఓ బాలిక పండంటి బిడ్డకు జన్మనిచ్చిన వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తొమ్మిదొవ తరగతి చదువుతున్న అమ్మాయి తొమ్మిది నెలలుగా కడుపులో బిడ్డను మోస్తూనే స్కూల్ కు వెళ్లడం విశేషం. కాగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

9వ తరగతి.. 
కర్ణాటక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రానికి చెందిన ఓ బాలిక బాగేపల్లికి దగ్గరలోని బాలికల సంక్షేమ శాఖ హాస్టల్‌లో 9వ తరగతి చదువుతోంది. అయితే ఇటీవల తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో టీచర్స్ సహాయంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఇంజెక్షన్‌ వేసి కొన్ని మందులిచ్చి పంపించేశారు వైద్యులు.

2.2 కిలోల మగబిడ్డ.. 
అయితే ఇంటికి వచ్చిన మరో రెండు గంటల్లోనే ఆమె మళ్లీ కడుపు నొప్పి అంటూ విలవిలలాడిపోవడంతో తాలూకా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరిశీలించి బాలిక నిండు గర్భిణి అని తెలిపారు. ప్రసవం నొప్పుల కారణంగానే ఆమె కడుపునొప్పి వస్తుందని చెప్పి వెంటనే బాలికకు కాన్పు చేయగా.. మగబిడ్డ జన్మించాడు. పుట్టిన శిశువు 2.2కేజీల బరువు ఉండటం విశేషం.

ఇది కూడా చదవండి : Ganja Chocolates: హైదరాబాద్ కు కూతవేటు దూరంలో.. కిరాణ షాపుల్లో గంజాయి చాక్లెట్లు.. గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులే టార్గెట్!

పోక్సో చట్టం కింద కేసు..
అయితే ఆ చిన్నారి పసిబిడ్డకు జన్మనివ్వడం చూసి డాక్టర్లు, పేరెంట్స్ అయోమయానికి గురయ్యారు. నిజానికి బాలికల హాస్టల్‌లో బాలికకు గర్భం ఎలా వచ్చిందనే విషయంపై ఇంకా వివరాలు తెలియాల్సివుంది. ఇక దీనిపై తాలూకా వైద్యాధికారి డాక్టర్‌ సి.ఎన్‌. సత్యనారాయణ రెడ్డి పోలీసులకు సమాచారం అందించగా హాస్టల్‌ వార్డెన్, ఇతర ఇబ్బందిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలిక, శిశువు ఆస్పత్రిలో ఉండగా ఇద్దరి ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు.

#karnataka #pregnent #14-years-girl
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe