DSP’s Tranfers: తెలంగాణలో 95 మంది డీఎస్పీల బదిలీలు

మరికొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న వేళ తెలంగాణలో అధికారులు బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా 95 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. SR నగర్ ఏసీపీ బదిలీ.. కొత్త ఏసీపీగా పి.వెంకట రమణను నియమించింది.

New Update
DSP’s Tranfers: తెలంగాణలో 95 మంది డీఎస్పీల బదిలీలు

DSP's Tranfers: మరికొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న వేళ తెలంగాణలో అధికారులు బదిలీలు (Officers Transfers) కొనసాగుతున్నాయి. తాజాగా 95 మంది డీఎస్పీల (95 DSP's Transferred) బదిలీలు చేస్తూ రేవంత్ (CM Revanth Reddy) సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాది డిసెంబర్ లో కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) రాష్ట్రాలకు.. గతమూడేళ్లుగా ఒకే చోట పని చేస్తున్న, సొంత జిల్లాల్లో పని చేస్తున్న అధికారులను బదిలీ చేయాలని ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈసీ ఇచ్చిన ఆదేశాలు మేరకు తెలంగాణలో కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అధికారులను గుర్తించి బదిలీ చేసే కార్యాచరణ మొదలు పెట్టింది.

ALSO READ: బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు.. రేపు ప్రకటన?

95 మంది బదిలీ..

తెలంగాణ రాష్ట్ర రెండవ సీఎంగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి తన మార్క్ ను చూపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో పని చేసిన అధికారులను, కేసీఆర్ కు అనుకూలంగా పనిచేసిన అధికారులను గుర్తించి బదిలీలు చేస్తూ రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆబ్కారీ, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖలో పెద్ద ఎత్తున అధికారులను బదిలీ చేసింది రేవంత్ సర్కార్. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీ చేసిన ప్రభుత్వం.. తాజాగా పోలీసు శాఖలో భారీగా బదిలీలు చేపట్టింది. తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 95 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ రవిగుప్తా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో కొనసాగుతున్న డీఎస్పీలను, ఏసీపీలను బదిలీ చేస్తూ ఆదేశలు ఇచ్చారు. రాబోయే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసు అధికారులను బదిలీ చేసినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

ఆంధ్ర ప్రదేశ్ లో కూడా సేమ్.. 

అధికారుల బదిలీలు తెలంగాణలోనే కాదు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే ఏపీలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ అక్కడి జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అలాగే.. ఇటీవల ఏపీలో భారీగా తహసీల్దార్ల బదిలీలు జరిగాయి. అయితే.. ఏపీలో మరికొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులకు బదిలీ చేస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి.

DO WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు