South Central Railway: 94 రైళ్లు రద్దు..41 రూట్ మార్పు! సెప్టెంబర్ చివరి వారంలో 94 రైళ్లను రద్దు చేస్తుండగా..41 రైళ్లను రూట్ మార్చుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు.వరంగల్-హసన్‌పర్తి-కాజీపేటెఫ్ క్యాబిన్ మధ్యలో రెండు లైన్ల మార్గాన్ని, నాలుగు లైన్లుగా అందుబాటులోకి తీసుకుని వచ్చే పనుల నేపథ్యంలో రద్దు చేసినట్లు సమాచారం. By Bhavana 31 Aug 2024 in తెలంగాణ ఖమ్మం New Update షేర్ చేయండి South Central Railway: సెప్టెంబర్ నాలుగో వారం నుంచి రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడనున్నట్లు అధికారులు తెలిపారు. 94 రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించడమే ఇందుకు కారణం. వరంగల్-హసన్‌పర్తి-కాజీపేటెఫ్ క్యాబిన్ మధ్యలో ప్రస్తుతం ఉన్న రెండు లైన్ల మార్గాన్ని, నాలుగు లైన్లుగా అందుబాటులోకి తీసుకుని వచ్చే పనుల నేపథ్యంలోనే రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో కొన్ని రైళ్లు కనిష్ఠంగా ఓ రోజు, గరిష్ఠంగా 15 రోజుల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉండవని తెలిపారు. 41 రైళ్లను దారి మళ్లించి నడుపుతారు. మరో 27 రైళ్ల ప్రయాణ వేళలను మార్చారు. రద్దయిన వాటిలో గోల్కొండ, శాతావాహన ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్- గుంటూరు ఇంటర్ సిటీ వంటి రైళ్లు ఈ లిస్ట్ లో ఉన్నాయి. మరికొన్ని సౌత్ స్టేట్స్ నుంచి తెలంగాణ మీదుగా రాకపోకలు సాగించేంది కూడా ఉన్నాయి. కాజీపే- సిర్పూర్ టౌన్---సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 7 వరకు, సిర్పూర్ టౌన్- కాజీపేట రైలు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 8 వరకు రద్దు చేశారు. భద్రాచలం రోడ్- బళ్లార్ష , బళ్లార్ష- కాజీపేట సెప్టెంబర్ 29- అక్టోబర్ 8 వరకు రద్దు చేసినట్లు అధికారులు వివరించారు. సికింద్రాబాద్-సిర్పుర్ కాగజ్ నగర్, సిర్పూర్ కాగజ్ నగర్- సికింద్రాబాద్ సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 7 వరకు రద్దయ్యాయి. గుంటూరు-సికింద్రాబాద్ , సికింద్రాబాద్-గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గుంటూరు-సికింద్రాబాద్ , సికింద్రాబాద్- గుంటూరు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 2 వరకు రద్దయ్యాయి. విజయవాడ-సికింద్రాబాద్,సికింద్రాబాద్-విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 7వరకు రద్దయ్యాయి. Also Read: జన్వాడ ఫాంహౌస్‌కు పర్మిషన్ లేదు.. అధికారుల సంచలన ప్రకటన #trains #south-central-railway #cancelled #route-changed మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి