Railway Jobs: రైల్వేలో 9,144 ఉద్యోగాలు..నోటిఫికేషన్ విడుదల

రైల్వే డిపార్ట్‌మెంట్ మళ్ళీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనుంది. పలు విభాగాల్లో 9, 144 టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది.

New Update
Railway Jobs: రైల్వేలో 9,144 ఉద్యోగాలు..నోటిఫికేషన్ విడుదల

RRB Railway Technician Recruitment 2024: రైల్వేశాఖ మరోసారి భారీ జాబ్ ఆఫర్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో 9,144 టెక్నీషియన్‌ పోస్టులను వివిధ విభాగాల్లో భర్తీకి రైల్వే శాఖ పిలుస్తోంది. వీటిల్లో టెక్నీషియన్‌ గ్రేడ్‌-1 సిగ్నల్‌ పోస్టులు 1092.. టెక్నీషియన్‌ గ్రేడ్‌-3 ఉద్యోగాలు 8,052 వరకు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 21 ఆర్ఆర్బీ రీజియన్లలో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ మార్చి 9వ తేదీ నుంచి మొదలైంది. ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 8వ తేదీ వరకు ఈ జాబ్స్‌కు అప్లై చేసుకోవచ్చును. పూర్తి వివరాలకు https://indianrailways.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

 రీజియన్ల వారీగా ఖాళీలివే :
ఆర్‌ఆర్‌బీ అహ్మదాబాద్ పోస్టులు: 761
ఆర్‌ఆర్‌బీ అజ్‌మేర్ పోస్టులు: 522
ఆర్‌ఆర్‌బీ బెంగళూరు పోస్టులు: 142
ఆర్‌ఆర్‌బీ భోపాల్ పోస్టులు: 452
ఆర్‌ఆర్‌బీ భువనేశ్వర్ పోస్టులు: 150
ఆర్‌ఆర్‌బీ బిలాస్‌పూర్ పోస్టులు: 861
ఆర్‌ఆర్‌బీ చండీగఢ్ పోస్టులు: 111
ఆర్‌ఆర్‌బీ చెన్నై పోస్టులు: 833
ఆర్‌ఆర్‌బీ గువాహటి పోస్టులు: 624
ఆర్‌ఆర్‌బీ జమ్ము అండ్‌ శ్రీనగర్ పోస్టులు: 291
ఆర్‌ఆర్‌బీ కోల్‌కతా పోస్టులు: 506
ఆర్‌ఆర్‌బీ మాల్దా పోస్టులు: 275
ఆర్‌ఆర్‌బీ ముంబయి పోస్టులు: 1284
ఆర్‌ఆర్‌బీ ముజఫర్‌పూర్ పోస్టులు: 113
ఆర్‌ఆర్‌బీ పట్నా పోస్టులు: 221
ఆర్‌ఆర్‌బీ ప్రయాగ్‌రాజ్ పోస్టులు: 338
ఆర్‌ఆర్‌బీ రాంచీ పోస్టులు: 350
ఆర్‌ఆర్‌బీ సికింద్రాబాద్ పోస్టులు: 744
ఆర్‌ఆర్‌బీ సిలిగురి పోస్టులు: 83
ఆర్‌ఆర్‌బీ తిరువనంతపురం పోస్టులు: 278
ఆర్‌ఆర్‌బీ గోరఖ్‌పూర్‌ పోస్టులు: 205

అర్హతలు..
టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు అప్లై చేసుకునేవారు బీఎస్సీ, బీఈ/ బీటెక్‌, డిప్లొమా (ఫిజిక్స్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఇన్‌స్ట్రుమెంటేషన్)లో తప్పనిసరిగా పాసై ఉండాలి. ఇక టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకైతే మెట్రిక్యులేషన్ లేదా ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐలో (ఎలక్ట్రీషియన్, వైర్‌మ్యాన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్, మెకానిక్, ఫిట్టర్, వెల్డర్, పెయింటర్ జనరల్, మెషినిస్ట్, కార్పెంటర్, ఆపరేటర్ అడ్వాన్స్‌డ్ మెషిన్ టూల్, మెషినిస్ట్, మెకానిక్ మెకానిక్, మెకానిక్ మెకాట్రానిక్స్‌, మెకానిక్ డీజిల్‌, మెకానిక్ మోటార్ వెహికిల్, టర్నర్, ఆపరేటర్ అడ్వాన్స్‌డ్‌ మెషిన్ టూల్, గ్యాస్ కట్టర్, హీట్ ట్రీటర్, ఫౌండ్రీమ్యాన్, ప్యాటర్న్ మేకర్, మౌల్డర్ తదితర బ్రాంచ్‌లలో ఏదైనా ఒకదానిలో పాసై ఉండాలి.) లేదా 10+2 (ఫిజిక్స్, మ్యాథ్స్‌) లో తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు..

టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ జాబ్‌కు అప్లై చేసుకునేవారి వయసు జులై 1, 2024 నాటికి.. 18 నుంచి 36 ఏళ్లు నిండి ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు 18 నుంచి 33 ఏళ్ళ మధ్య వయసు ఉండాలి. ఇక ఎస్సీ/ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు.. దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంది.

ఫీజు ..

ఎస్సీ/ ఎస్టీ/ మాజీ సైనికోద్యోగులు/ మహిళలు/ ట్రాన్స్‌జెండర్‌/ మైనారిటీ/ ఈబీసీ అభ్యర్థులు 250రూ ఫీజు చెల్లించాలి. ఇతరులు రూ.500 చొప్పున చెల్లించాలి.

ఎంపిక విధానం..

రెండు పోస్టులకూ కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ రాత పరీక్షతో పాటూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం..

ఈ పోస్టులకు ఎంపికైతే టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు నెలకు రూ.29,200.. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు రూ.19,900 జీతం ఇస్తారు.

Also Read:Telangana: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇకమీదట ప్రతీ ఏడాది జాబ్ కేలండర్

Advertisment
Advertisment
తాజా కథనాలు