Supreme Court Recruitment 2024: నిరుద్యోగులకు భారత సర్వోన్నత న్యాయస్థానం తీపి కబురు అందించింది. న్యూ ఢిల్లీలోని (New Delhi) సుప్రీం కోర్టులో ఒప్పంద ప్రాతిపదికన 90 లా క్లర్క్-కమ్-రిసెర్చ్ అసోసియేట్ (Law Clerk/Research Associate) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న ఆసక్తిగల అభ్యర్థులు కింద సూచించిన విధంగా అప్లై చేసుకోవాలని సూచించింది.
అర్హతలు:
- న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు అభ్యర్థికి రిసెర్చ్/ అనలిటికల్ స్కిల్స్, రాత నైపుణ్యాలు, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి ఉండాలి.
- ఏదైనా డిగ్రీ పూర్తిచేసి మూడేళ్ల లా కోర్సు చివరి సంవత్సరం చదువుతున్నవారితోపాటు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సు చివరి ఏడాది చదువుతున్నవారు కూడా ఈ కొలువులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
15.02.2024 నాటికి అభ్యర్థుల వయసు 20 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.500 ఆన్‌లైన్ విధానంలో చెల్లించాలి.
దరఖాస్తు:
- ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2024 ఫిబ్రవరి 15.
ఇది కూడా చదవండి : Balka Suman:’బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కనిపించడం లేదు’
ఎంపిక:
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా నియామకాలు చేపడతారు. 2024 మార్చి 10 రాత పరీక్ష నిర్వహించనున్నారు.
ఒకే రోజు రెండు సెషన్స్:
పార్ట్-1, పార్ట్-2 పరీక్షలను రెండు సెషన్లలో ఒకే రోజున నిర్వహిస్తారు. అయితే రెండు పరీక్షల మధ్యా కొంత విరామం ఉంటుంది.
పరీక్షా కేంద్రాలు..
దేశవ్యాప్తంగా 23 కేంద్రాల్లో కేటాయించారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నంలో పరీక్షలు నిర్వహిస్తారు.
పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్: www.sci.gov.in