JOBS: సుప్రీంకోర్టులో 90 ఉద్యోగాలు..డిగ్రీతో పాటు ఆ స్కిల్ ఉంటే చాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. సుప్రీంకోర్టులో ఒప్పంద ప్రాతిపదికన 90 లా క్లర్క్‌-కమ్‌-రిసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 2024 ఫిబ్రవరి 15 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ.

New Update
Breaking: పోస్టల్‌ బ్యాలెట్‌ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వైసీపీ

Supreme Court Recruitment 2024: నిరుద్యోగులకు భారత సర్వోన్నత న్యాయస్థానం తీపి కబురు అందించింది. న్యూ ఢిల్లీలోని (New Delhi) సుప్రీం కోర్టులో ఒప్పంద ప్రాతిపదికన 90 లా క్లర్క్‌-కమ్‌-రిసెర్చ్‌ అసోసియేట్‌ (Law Clerk/Research Associate) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న ఆసక్తిగల అభ్యర్థులు కింద సూచించిన విధంగా అప్లై చేసుకోవాలని సూచించింది.

అర్హతలు:
- న్యాయశాస్త్రంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు అభ్యర్థికి రిసెర్చ్‌/ అనలిటికల్‌ స్కిల్స్‌, రాత నైపుణ్యాలు, కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి ఉండాలి.
- ఏదైనా డిగ్రీ పూర్తిచేసి మూడేళ్ల లా కోర్సు చివరి సంవత్సరం చదువుతున్నవారితోపాటు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ లా కోర్సు చివరి ఏడాది చదువుతున్నవారు కూడా ఈ కొలువులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి:
15.02.2024 నాటికి అభ్యర్థుల వయసు 20 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.500 ఆన్‌లైన్‌ విధానంలో చెల్లించాలి.

దరఖాస్తు:
- ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2024 ఫిబ్రవరి 15.

ఇది కూడా చదవండి : Balka Suman:’బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కనిపించడం లేదు’

ఎంపిక:
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా నియామకాలు చేపడతారు. 2024 మార్చి 10 రాత పరీక్ష నిర్వహించనున్నారు.

ఒకే రోజు రెండు సెషన్స్:
పార్ట్‌-1, పార్ట్‌-2 పరీక్షలను రెండు సెషన్లలో ఒకే రోజున నిర్వహిస్తారు. అయితే రెండు పరీక్షల మధ్యా కొంత విరామం ఉంటుంది.

పరీక్షా కేంద్రాలు..
దేశవ్యాప్తంగా 23 కేంద్రాల్లో కేటాయించారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, విశాఖపట్నంలో పరీక్షలు నిర్వహిస్తారు.

Notification PDF

పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌: www.sci.gov.in

Advertisment
Advertisment
తాజా కథనాలు