Delhi : 8వ తరగతి బాలుడిపై లైంగిక దాడి.. పురుషాంగంలో అవి చొప్పించి దారుణం!

ఢిల్లీలోని ఓ స్కూల్ లో దారుణం జరిగింది. 8వ తరగతి బాలుడిపై తోటి విద్యార్థులు శారీరక, లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలుడి మూత్రనాళంలోకి చిన్న కర్రను చొప్పించి క్రూరంగా వ్యవహరించారు. బాధితుడు ఆస్పత్రిపాలవగా.. అతని తల్లి సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తోంది.

New Update
Delhi : 8వ తరగతి బాలుడిపై లైంగిక దాడి.. పురుషాంగంలో అవి చొప్పించి దారుణం!

8th Class Student :ఢిల్లీ(Delhi) లోని ఓ పాఠశాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 8వ తరగతి చదువుతున్న బాలుడిని తోటి విద్యార్థులు లైగింకంగా వేధించి చిత్ర హింసలకు గురిచేశారు. అంతటితో ఆగకుండా బాధితుడి పురుషాంగాన్ని కర్రలతో కొట్టి మూత్రనాళంలో చిన్నపాటి కర్రను చొప్పింది పైచాచిక ఆనందం పొందారు. దీంతో లోపలికి వెళ్లిన కర్ర ఆ బాలుడి పేగుకు తీవ్ర నష్టం కలిగించడంతో ఆస్పత్రిపాలయ్యాడు.

శారీరక, లైంగిక వేధింపులు..
ఈ మేరకు స్కూల్ యాజమాన్యం, తల్లి దండ్రుల(Parents) తెలిపిన వివరాల ప్రకారం.. 8వ తరగతి చదువుతున్న ఓ బాలుడిని సహవిద్యార్థులు దారుణంగా కొట్టి, లైంగికంగా వేధించారు(Sexually Assaulted). ఇదంతా పాఠశాల లోపలే జరిగింది. బాలుడి పురుషాంగంలో కర్రను చొప్పించడంతో బాధితుడి పేగుకు గాయాలు అయ్యాయి. దీనిపై 14 ఏళ్ల బాలుడి తల్లి తన బిడ్డకు జరిగిన అన్యాయంపై నిలదీసింది. కొంత మంది విద్యార్థులు పిల్లవాడిపై దాడి చేసి శారీరక, లైంగిక చర్యలకు పాల్పడ్డట్లు బయటపెట్టింది. మార్చి 18న ఈ దారుణం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అలాగే బాధితుడిని ఎవరికైనా చెబితే మరింత హాని చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డట్లు తెలిపాడు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ఆ బాలుడు తనకు ఎదురైన బాధను ఎవరికీ చెప్పకుండా, ఎవరికీ ఫిర్యాదు చేయకుండా బాధను తట్టుకున్నట్లు చెప్పాడు.

తల్లి సిబిఐ విచారణను డిమాండ్..
బాధితురాలి తల్లి ఈ విషయంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసింది. భయంకరమైన చర్యలో పాల్గొన్న పిల్లలపై వేగంగా చర్యలు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పాఠశాల, విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేసింది. బాధితుడు మరో సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. భయంతో తన బిడ్డ అర్ధరాత్రి నిద్రలేస్తన్నాడు. కొన్ని అంతర్గత అవయవాలు దెబ్బతిన్నాయని, బాధితురాలికి మరో శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారని మహిళ తెలిపింది.

Also Read : లోకల్ ట్రైన్ లో మర్డర్.. మద్యం మత్తులో ప్రయాణికుడిని చంపిన యువకులు.. వీడియో వైరల్!

Advertisment
తాజా కథనాలు