Crocodile: రోడ్డు మధ్యలో 8 అడుగుల పెద్ద మొసలి.. వైరల్ వీడియో!

మహారాష్ట్రలోని సిప్లాన్ లో ఓ రహదారిపై భారీ మొసలి హల్ చల్ చేసింది. సిప్లాన్ సమీపంలో ఉన్న నదిలో మూడు మొసళ్లు ఉన్నాయి.అయితే గత కొన్నిరోజులుగా కురిసిన భారీ వర్షాలకు రోడ్డు పై మొసలి రావటంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు.ఓ వ్యక్తి తీసిన ఈ వీడియో వైరల్ గా మారింది.

New Update
Crocodile: రోడ్డు మధ్యలో 8 అడుగుల పెద్ద మొసలి.. వైరల్ వీడియో!

Maharashtra: మహారాష్ట్రలోని సిప్లాన్ నగరం వెంట శివ అనే నది ప్రవహిస్తుంది.ఈ నదిలో 3 రకాల మొసళ్ళు నివసిస్తాయి.ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా సిప్లాన్ నది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ స్థితిలో ఇటీవల మనుషుల రద్దీ ఎక్కువగా లేని ప్రాంతంలో ఓ మొసలి రాత్రిపూట రోడ్డుపై గంభీరంగా విహరించింది.

దారిన వెళ్తున్న ఓ వ్యక్తి దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.మొసళ్ల సంచారం ఎక్కువగా ఉందని ఫిర్యాదు చేసినా మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోలేదని స్థానికులు చెబుతున్నారు.

Advertisment
తాజా కథనాలు