IIT Bombay: దుమ్ములేపిన బాంబే ఐఐటీ విద్యార్థులు..85 మందికి కోటికి పైగా వేతనం!

బాంబే ఐఐటీ విద్యార్థులు మరోసారి తమ సత్తా చాటారు. క్యాంపస్ సెలక్షన్స్‌లో 85 మందికి పైగా కోటి రూపాయల కంటే ఎక్కువగా వేతనంతో ఉద్యోగాలకు ఎంపిక అయ్యారు. వీరిలో 63 మందికి విదేశీ ఆఫర్లు కూడా రావడం విశేషం.

New Update
IIT Bombay: దుమ్ములేపిన బాంబే ఐఐటీ విద్యార్థులు..85 మందికి కోటికి పైగా వేతనం!

IIT Bombay - Campus Selections:క్యాంపస్ సెలక్షన్స్‌లో బాంబే ఐఐటీ స్టూడెంట్స్ దుమ్ములేపారు. 2023-24 నియామకాల సీజన్‌ ఫేజ్‌-1లో భాగంగా అధిక ప్యాకేజీలను సొంతం చేసుకుని సూప్ అనిపించుకుంటున్నారు. బాంబే ఐఐటీ విద్యార్ధుల్లో మొత్తం 1,188 మందికి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌ దక్కగా.. వీరిలో 63 మందికి అంతర్జాతీయ ఆఫర్లు కూడా వచ్చాయి. వీరిలో 85మందికి కోటి రూపాయల (1 Crore Package) కంటే ఎక్కువ వేతనంతో జాబ్ ఆఫర్లు వచ్చాయి. అత్యధిక వార్షిక వేతనం రూ.3 కోట్లు. ఐఐటీ బాంబే (IIT Bombay) నిర్వహించినక్యాంపస్ సెలక్షన్స్‌లో మొత్తం 388 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పాల్గొన్నాయి.

Also Read:కరోనా డేంజర్ బెల్స్ ..పెరుగుతున్న మరణాల సంఖ్య

క్యాంపస్‌కు క్యూ కట్టిన పెద్ద కంపెనీలు..

యాక్సెంచర్‌, ఎయిర్‌బస్‌, యాపిల్‌, బార్‌క్లేస్‌, గూగుల్‌ (Google), జేపీ మోర్గాన్‌ చేజ్‌, మైక్రోసాఫ్ట్‌ (Microsoft), టాటా గ్రూప్‌ వంటి ప్రఖ్యాత సంస్థలు క్యాపస్ సెలక్షన్స్‌కు వచ్చాయి. కొన్ని సంస్థలు నేరుగా, మరికొన్ని వర్చువల్‌గా ఇంటర్వ్యూలు నిర్వహించాయి. తమ విద్యా సంస్థలో చదువుతోన్న 60 శాతం మంది విద్యార్థులు ఫేజ్-1లో ఉన్నారని చెబుతున్నారు ఐఐటీ (IIT) అధికారులు. ఇందులో 63 మంది జపాన్, తైవాన్, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, సింగ్‌పూర్, హాంగ్‌కాంగ్ వంటి దేశాల్లో జాబ్ ఆఫర్లు వచ్చాయి.

అత్యధిక ప్యాకేజీ 32.38 లక్షలు

ఇంజినీరింగ్‌, టెక్నాలజీ విభాగంలో ఎక్కువ మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. తర్వాతి స్థానాల్లో ఐటీ/ సాఫ్ట్‌వేర్‌, ఫైనాన్స్‌/ బ్యాంకింగ్‌/ ఫిన్‌టెక్‌, మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌, డేటా సైన్స్‌ అండ్‌ అనలిటిక్స్‌, రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, డిజైన్‌ ఉన్నాయి. ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ విద్యార్థులు సగటున రూ.21.88 లక్షల ప్యాకేజీని సొంతం చేసుకోగా..ఐటీ/ సాఫ్ట్‌వేర్‌ విద్యార్థులు రూ.26.335 లక్షలు.. ఫైనాన్స్‌ రూ.32.38 లక్షలు, కన్సల్టింగ్‌ రూ.18.68 లక్షలు, రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ రూ.36.94 లక్షల వేతనంతో జాబ్స్ కొట్టేశారు.

Also Read: కరోనా డేంజర్ బెల్స్ ..పెరుగుతున్న మరణాల సంఖ్య

Advertisment
తాజా కథనాలు