Ship Drowned: గల్ఫ్ లోని ఒమన్ సముద్ర తీరంలో చమురు రవాణా చేస్తున్న ఓడ ఒకటి నిన్న మునిగిపోయింది. ఈ ఘటనలో 16మంది గల్లంతు అయ్యారు. వారిలో 13మంది భారత సిబ్బంది ఉన్నారు. మునిగిపోయిన ఓడను ప్రెస్టీజ్ ఫాల్కాన్ గా గుర్తించారు. పోర్ట్ టౌన్ దుకమ్‌కు దగ్గరలోని రాస్ మద్రాకు 25 నాటికల్ మైళ్ళ దూరంలో ఓడ మునిగిపోయిందని ఆదేశ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ తెలిపింది. అయితే ఆయిల్ ట్యాంకర్ మునిగిపోవడానికి కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. ఓడలో మొత్తం 16మంది సహాయక సిబ్బంది ఉన్నారు. ఇందులో ముగ్గురు శ్రీలంకకు చెందిన వారు కాగా మిగతా 13మంది భారతీయులు.
ఈ ఘటనకు సంబంధించి రెస్క్యూ బృందాలు శుభవార్తను చెప్పాయి. మునిగిపోయిన వారిలో తొమ్మిది మందిని కాపాడామని తెలిపారు. ఇందులో ఎనిమిది మంది భారతీయులు కాగా ఒకరు శ్రీలంకకు చెందిన వారు. మిగతా వారి కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి. సెర్చ్ ఆపరేషన్‌లో భారతీయ నౌకాదళం పాల్గొన్నట్లు తెలుస్తోంది. దాంతోపాటూ ఈ ప్రమాదంలో భారతీయ సిబ్బంది ఉన్న కారణంగా స్థానిక అధికారులతో ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా తెలుస్తోంది.
Also Read:Maharashtra: డిగ్రీ పూర్తయితే నెలకు పదివేలు..మహారాష్ట్రలో కొత్త స్కీమ్