Air India Express cancels 70 flights: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సంస్థకు చెందిన సిబ్బంది అంతా కూడా ఒకేసారి సిక్ లీవ్ (Sick Leave) పెట్టారు. దీంతో కేవలం 12 గంటల్లో 70 విమానాలను సంస్థ రద్దు చేసింది. రద్దు అయిన విమానాల్లో అంతర్జాతీయ, దేశీయ విమానాలు కూడా ఉన్నాయి. క్యాబిన్ సిబ్బంది అంతా కూడా ఒకేసారి చివరి నిమిషంలో సిక్ లీవ్ పెట్టడంతో మంగళవారం రాత్రి నుంచి విమానాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఎయిర్ ఇండియా సిబ్బంది ఒకరు తెలిపారు.
ఉద్యోగులు అంతా ఒక్కసారిగా సిక్ లీవ్ ఎందుకు పెట్టారు అనే విషయం తెలియడం లేదని ఎయిర్ ఇండియా అధికారులు పేర్కొన్నారు. విమానాలు క్యాన్సిల్ అయ్యి ప్రయాణాలు రద్దయిన వారందరికీ కూడా రీఫండ్ చేస్తున్నట్లు అధికారులు వివరించారు.లేకపోతే వారు కోరుకుంటే మరోసారి వారికి ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
@AirIndiaX @TataCompanies around Four AirIndia Express Flights Delayed from Calicut … As per the officials there is a strike happening from the Crew members. Only Muscat flight is boarded and other flights are not yet updated the time.#mediaone #AirIndiaExpress#Elecciones24 pic.twitter.com/fsbuE9iTXk
— hisham backer (@HishamBacker) May 7, 2024
అయితే, టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్‌లైన్ మేనేజ్‌మెంట్ తో క్యాబిన్ క్రూ సభ్యుల మధ్య వివాదాలకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపించినందుకు డిసెంబర్ 2023లో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ షోకాజ్ నోటీసు జారీ చేసింది.
Also read: రాజకీయ వారసుడి పై మాయావతి వేటు..కేవలం 5 నెలల్లోనే!