Sleep Tips: కునుకు తియ్యలేకపోతున్నారా? ఈ ఏడు ట్రిక్స్‌ పాటిస్తే ఇట్టే నిద్రపోతారు..!

సౌకర్యవంతమైన పరుపు, దిండ్లను ఎంచుకోని నిద్రపోవడం ముఖ్యం. ఎక్కువగా నిద్రపట్టని వాళ్లు లైఫ్‌స్టైల్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. లోతైన శ్వాస, ధ్యానం లేదా యోగా లాంటి పద్ధతులను జీవితంలో భాగం చేసుకోవాల్సి ఉంటుంది.బెడ్‌ టైమ్‌కు ముందు మొబైల్‌ లేదా ల్యాప్‌టాప్‌ లాంటి ఉపయోగించడం మానుకోండి.

Health Tips : రాత్రి పడుకునేముందు ఇవి తింటే..హాయిగా నిద్ర పడుతుంది...!!
New Update

Sleep Tips:చాలామందికి బెడ్‌పై వాలిన వెంటనే నిద్రపట్టదు. ఏదో ఆలోచిస్తూ అలా ఉండిపోతారు. మరికొందరు నిద్రపట్టకపోతే ఫోన్‌ పట్టుకోని నెట్టింట్లో మునిగిపోతారు. తర్వాత టైమ్‌ చూసుకుంటే తెల్లారుతుంది. అప్పుడు నిద్రపోయినా కాలేజీకో, ఆఫీస్‌కో త్వరగా లెగాల్సి వస్తుంది. అంటే మొత్తం కలిపి మూడు గంటలు కూడా నిద్రపోరు. అది కూడా క్వాలిటీ స్లీప్ కాదు. ఇలా రోజూ జరుగుతుంటే అనేక హెల్త్‌ ఇష్యూస్‌ వస్తాయి. ఇలా నిద్రపట్టకపోవడం కూడా పెద్ద సమస్యే. ఇలాంటి సమస్యలకు లాంగ్‌టర్మ్‌ సోలూష్యన్స్‌ అవసరం. అంటే ముందు మార్చుకోవాల్సింది లైఫ్‌ స్టైల్‌. సరైన నిద్రకు ఎలాంటి లైఫ్‌స్టైల్‌ అలవర్చుకోవాలి.. ఏ పనులు చేయకూడదు లాంటివి తెలుసుకోండి.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి:

క్రమం తప్పకుండా వ్యాయామం నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయినప్పటికీ, నిద్రవేళకు కొన్ని గంటల ముందు వ్యాయామం చేయకుండా ఉండటానికి ప్రయత్నించండి. స్మాల్‌ వాక్‌ చాలు.

నిద్రవేళకు ముందు ఉత్తేజపరిచే కార్యకలాపాలను నివారించండి:

  • బెడ్‌ టైమ్‌కు ముందు మొబైల్‌ లేదా ల్యాప్‌టాప్‌ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడం మానుకోండి. ఎందుకంటే ఈ పరికరాల నుంచి వెలువడే బ్లూ లైట్ మీ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.

స్థిరమైన నిద్ర షెడ్యూల్‌కు కట్టుబడి ఉండండి:

  • వారాంతాలతో సహా ప్రతిరోజూ ఒకే సమయంలో నిద్రపోవడానికి, మేల్కొనడానికి ప్రయత్నించండి.

నిద్రకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించండి:

  • మీ పడకగది చీకటిగా, చల్లగా, నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోండి. మీకు నిద్రపోవడానికి సహాయపడటానికి బ్లాక్ అవుట్ కర్టెన్లు ఉపయోగించడాన్ని పరిగణించండి.

రిలాక్సేషన్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయండి:

  • లోతైన శ్వాస, ధ్యానం లేదా యోగా లాంటి పద్ధతులు ఒత్తిడిని తగ్గించడానికి, విశ్రాంతిని ప్రోత్సహించడంలో సహాయపడతాయి. ఇది మీకు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

పగటిపూట న్యాప్స్:

  • మీరు పగటిపూట నిద్రపోవలసి వస్తే, దానిని 30 నిమిషాలకు పరిమితం చేయడానికి ప్రయత్నించండి.
  • సౌకర్యవంతమైన పరుపు, దిండ్లను ఎంచుకోండి.

ఇది కూడా చదవండి: మీ గార్డెన్‌లోని మందార మొక్క ‘పూలు’ ఇవ్వడం లేదా? అయితే ఇలా చేయండి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#health-benefits #sleep-tips
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe