ఈ కోర్సులు మీరు నేర్చుకున్నారా..అయితే జాబ్ మీదే..!

ప్రస్తుతం ఐటీ కంపెనీలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో ఈఆర్పీ, ఆటోమోటివ్‌ డిజైన్‌, టెస్టింగ్‌, ఆడ్మినిస్ట్రేషన్ వంటి విభాగాల్లో నైపుణ్యాలు ఉన్న వారికి డిమాండ్‌ నెలకొన్నట్లు బిజినెస్‌ సొల్యూషన్స్ సేవల సంస్థ క్వెస్ కార్ప్‌ ఓ నివేదికలో తెలిపింది.

ఈ కోర్సులు మీరు నేర్చుకున్నారా..అయితే జాబ్ మీదే..!
New Update

ఐటీ వ్యవస్థ ప్రస్తుతం ఎన్ని అటుపోట్లను ఎదుర్కొంటుందో తెలిసిందే. ప్రముఖ కంపెనీలే తమ ఉద్యోగులును ఎప్పుడూ తీసిపారేస్తాయో తెలియక ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇంత గడ్డు పరిస్థితుల్లో కూడా కొన్ని విభాగాల్లో నిపుణులకు ఫుల్‌ డిమాండ్ ఉంది. వాటిలో ముఖ్యమైనవి ఈఆర్పీ, ఆటోమోటివ్‌ డిజైన్‌, టెస్టింగ్‌, ఆడ్మినిస్ట్రేషన్ వంటి విభాగాల్లో నైపుణ్యాలు ఉన్న వారికి డిమాండ్‌ నెలకొన్నట్లు బిజినెస్‌ సొల్యూషన్స్ సేవల సంస్థ క్వెస్ కార్ప్‌ ఓ నివేదికలో తెలిపింది.

ఈ మధ్య కాలంలో తొలిసారిగా పెద్ద ఐటీ సర్వీసుల కంపెనీల్లో సిబ్బంది సంఖ్య, గైడెన్స్‌ తగ్గింది. రానున్న కాలంలో పరిశ్రమ అన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తూ అడుగులు వేయాలని కంపెనీ భావిస్తున్నట్లు క్వెస్‌ ఐటీ స్టాఫింగ్‌ సీఈవో శివరామ్ తెలిపారు.

ప్రస్తుతం కంపెనీలు తమ వ్యాపార నిర్వహణ విషయంలో చాలా విధానాలను మార్చుకుంటున్నాయని , వచ్చే రెండేళ్లలో కృతిమ మేథ ప పెట్టుబడులు పెట్టేందుకు 85 శాతం భారత కంపెనీలు భావిస్తున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం పై ఇన్వెస్ట్‌ చేసే వారికి అపార అవకాశాలు ఉన్నాయని వివరించారు.

గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల వ్యవస్థ గణనీయంగా వృద్ధి చెందుతోందని జనరేటివ్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ రాకతో దేశీ ఐటీ రంగంలో కొత్త సాంకేతికతలు మొదలవుతాయని శివరామ్‌ పేర్కొన్నారు. డిమాండ్ సరఫరా గణాంకాల ఆధారంగా ఈ నివేదిక రూపొందింది.

ఈఆర్‌పీ, ఆటోమోటివ్‌ డిజైన్‌, టెస్టింగ్, డెవలప్‌మెంట్‌ , అడ్మినిస్ట్రేషన్‌ ఈ 5 నైపుణ్యాలకు నియామకాలకు సంబంధించిన మొత్తం డిమాండ్‌ లో 65 శాతం మేజర్‌ పార్ట్ కలిగి ఉంది. టెక్నాలజీ హబ్‌ గా పేరొందిన బెంగళూరును దాటి ఐటీ రంగం ఇతర ప్రాంతాలకు వేగంగా విస్తరిస్తోంది.

వర్ధమాన టెక్ హబ్ లైన హైదరాబాద్ తో పాటు పూణె, ముంబై, చెన్నై , ఎన్‌సీఆర్‌ కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. దేశ విదేశాలకు చెందిన దిగ్గజ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి.

Also read: విశాఖలో మ్యాచ్‌ అంటే ఆ మజానే వేరు.. ఇలాంటి అనుభూతి ఎక్కడా రాదు!

#ai #jobs
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe