Govt Scheme:మహిళలకు గుడ్ న్యూస్..ఖాతాల్లోకి రూ. 6వేలు..సర్కార్ అందిస్తున్న ఈ సాయం గురించి మీకు తెలుసా..? దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడంలో భాగంగా ప్రభుత్వం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. అందులో ఒకటి ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన. ఈ స్కీం దేశంలోని గర్బిణీ స్త్రీలకు నేరుగా ఆర్థిక సాయం అందిస్తుంది. By Bhoomi 05 Dec 2023 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి దేశంలోని ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో పథకాలను తీసుకువచ్చింది. కేవలం మహిళల కోసం మాత్రమే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓ అద్భుతమైన పథకం గురించి ఇప్పుడు తెలసుకుందాం. ఆ పథకం పేరు ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన. మాతృ వందన యోజనలో భాగంగా దేశంలోని గర్బిణీలకు నేరుగా ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ పథకం గురించి పూర్తి వివరాలు ఏంటి. అర్హులైన మహిళలు ఏవిధంగా దరఖాస్తు చేసుకోవాలి. ఆ వివరాలన్నింటిని ఇప్పుడు చూద్దాం. మహిళల కోసం ప్రధాన మంత్రి మాతృ వందన యోజన తీసుకువచ్చిన కేంద్రం ఈ పథకంలో చేరిన వారి బ్యాంకు ఖాతాలో రూ. 5వేలు జమచేస్తుంది. జనవరి 1, 2017న ఈ పథకాన్ని ప్రారంభించింది. దేశంలోని ఏ ఒక్క బిడ్డ కూడా పోషకాహార లోపంతో లేదా నివారించగల వ్యాధులతో బాధపడకూడదని ప్రభుత్వం లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ స్కీం కింద గర్బిణీలకు సర్కార్ ఆర్థిక సాయం అందజేస్తుంది. నవజాత శిశువుల సంరక్షణ, వ్యాధుల నివారణకు సర్కార్ రూ. 5వేలు అందజేస్తుంది. ఈ స్కీం కోసం గర్బిణీ స్త్రీల వయస్సు 19ఏళ్ల కంటే ఎక్కువగా ఉండాలి. ఈ మొత్తం రూ. 5వేల ఒకేసారి అందించరు. వాయిదాల పద్ధతిలో చెల్లిస్తారు. గర్బిణీలకు మొదటి విడత రూ. 1000, రెండో విడత, రూ.2వేలు, మూడో విడత రూ. 2వేలు అందిస్తున్ానరు. ఈ డబ్బు నేరుగా గర్బిణీల ఖాతాలోకి జమ అవుతుంది. ఇక మొదటి కాన్పులో ఆడ లేదా మగ బిడ్డ పుట్టినప్పటికీ మూడు దశల్లో గర్బం దాల్చినట్లు ఆన్ లైన్ లో నమోదు అవ్వగానే వెయ్యి రూపాయలు, ఆ తర్వాత ఆరు నెలలకు రెండు వేల రూపాయలు ప్రసవం జరిగిన 14 వారాల్లో రెండువేల చొప్పున మొత్తం మూడు విడతల్లో ఇప్పటి వరకు ఆర్థిక లబ్ది అందజేస్తుంది. మొదటి కాన్పుకు మాత్రమే కాకుండా రెండో కాన్పుకు కూడా ఈ డబ్బును అందిస్తుంది ప్రభుత్వం. రెండో కాన్పులో పాప పుడితే తల్లికి రూ. 6వేలు ఇస్తామని కేంద్రం తెలిపింది. ఇలా రెండు కాన్పులకు కలిపి మొత్తం 11వేల రూపాయల వరకు కేంద్రం నుంచి గర్బిణీలకు ఆర్ధిక సాయం అందిస్తుంది. మీ దగ్గర్లోని ఆశా వర్కర్ ను కలిస్తే మిమ్మల్ని ఈ పథకంలో చేర్పిస్తారు. లేదంటే ఈ పథకంలో చేరాలంటే డైరెక్టుగా ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీనికి అధికారిక వెబ్ సైట్ wcd.nic.in/schemes/pradhan-mantri-matru-vandana-yojanaని సందర్శించండి. ఇందులో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అవ్వాలి. గర్బిణీలకు ఈ పథకం వర్తిస్తుంది. అన్ని రాష్ట్రాలోనూ ఈ పథకం అందుబాటులో ఉంది. తల్లిదండ్రుల ఆధార్ కార్డు, గుర్తింపు కార్దు, పిల్లలు బర్త్ సర్టిఫికేటే, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ అవసరం ఉంటాయి. ఇది కూడా చదవండి: కేవలం రూ. 65 పొదుపు చేస్తే మీ అకౌంట్లోకి రూ. 16లక్షలు. సర్కార్ అదిరిపోయే స్కీమ్..పూర్తివివరాలివే..!! #govt-scheme #pregnant-ladies మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి