పెళ్లీడుకు వచ్చిన వారు ఎవరైనా కనిపిస్తే ముందుగా అడిగే మాట..పప్పన్నం పెడుతున్నావు అని. పెళ్లి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పెళ్లి విందే. వివాహ భోజనంబు అంటేనే ఎన్నో రకాల పసందైన వంటకాలే. కొన్ని కొన్ని సార్లు జనం ఎక్కువైతే వచ్చిన వారికి మర్యాదలు జరగడంలో లోటుపాట్లు జరుగుతాయి.
అలా ఓ పెళ్లి వేడుకలో భోజనాల్లో రసగుల్లా కోసం తన్నుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్ లో జరిగింది. స్థానిక శంషాబాద్ ప్రాంతంలో ఆదివారం ఓ వివాహ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా అతిథులకు పసందైన వంటకాలు వడ్డించారు.
కొందరు భోజనాలు అయిన తరువాత పెళ్లి వేడుకలో రసగుల్లాలు అయిపోయాయి. కొందరికీ అందలేదు. దీంతో ఓ వ్యక్తి ముందు వారికి రసగుల్లాలు అందాయి. మాకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అది కాస్తా ఘర్షణకు దారి తీసింది. ఈ గొడవలో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక పోలీసు అధికారి ఒకరు వివరించారు.
క్షతగాత్రులను భగవాన్ దేవి, యోగేష్, మనోజ్, కైలాష్, ధర్మేంద్ర, పవన్ గా పోలీసులు గుర్తించారు. వారికి చికిత్స అందించడం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం గురించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.కాగా గతేడాది అక్టోబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని ఎత్మాద్‌పూర్‌లో ఓ పెళ్లి వేడుకలో మిఠాయిల కొరత విషయమై జరిగిన గొడవలో ఓ వ్యక్తి మృతి చెందాడు.
Also read: రన్ వే అదుపు తప్పి సముద్రంలోకి దూసుకెళ్లిన విమానం!