Congress: అర్థరాత్రి ...ఆ ఆరుగురు!

బీఆర్‌ఎస్‌ కు భారీ దెబ్బ తగిలింది.అర్థరాత్రి దాటిన తరువాత ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్‌ లో చేరడం సంచలనం రేపింది.అర్థరాత్రి ఒంటి గంట సమయంలో సీఎంరేవంత్‌ ,రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ ఛార్జ్‌ దీపా దాస్‌ మున్షీల సమక్షంలో కాంగ్రెస్‌ కండువాలు కప్పేసుకున్నారు.

New Update
Congress: అర్థరాత్రి ...ఆ ఆరుగురు!

MLC's Joined in Congress: బీఆర్‌ఎస్‌ కు భారీ దెబ్బ తగిలింది. గురువారం అర్థరాత్రి దాటిన తరువాత ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు (BRS MLC's) ఒకేసారి కాంగ్రెస్‌ లో చేరడం సంచలనం రేపింది. ఎక్కడా ఎలాంటి హడావిడి లేకుండా..ముందస్తు ఊహాగానాలకు చోటు లేకుండా ఈ ప్రక్రియ అంతా ఎంతో సీక్రెట్‌ గా జరిగిపోయింది.

అర్థరాత్రి ఒంటి గంట సమయంలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy), రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ ఛార్జ్‌ దీపా దాస్‌ మున్షీల సమక్షంలో వారంతా కాంగ్రెస్‌ కండువాలు కప్పేసుకున్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు భాను ప్రసాద్‌, బస్వరాజు సారయ్య, దండె విఠల్‌, ఎంఎస్‌ ప్రభాకర్‌, యెగ్గే మల్లేశం, బొగ్గారపు దయానంద్‌ లు పార్టీ మారారు.

వీరంతా గురువారం సాయంత్రం హైదరాబాద్‌ లోని ఓ హోటల్‌ లో సమావేశమై రాత్రి 11.30 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌ లోని ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ముగించుకుని నివాసానికి చేరుకోగానే వారు పార్టీలో చేరారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు సురేందర్‌ రెడ్డి ఉన్నారు.

ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి ఇంటికి వచ్చిన నిమిషాల్లోనే ఈ చేరికల కార్యక్రమం పూర్తయింది. ఇప్పటికే కాంగ్రెస్‌ లోకి ఆరుగురు ఎమ్మెల్యేలు వచ్చిన సంగతి తెలిసిందే. వారిలో దానం నాగేందర్‌ , కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, సంజయ్ కుమార్‌, కాలె యాదయ్య ఉన్నారు. మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి కుమారుడు అమిత్‌ కూడా ఆ పార్టీ గూటికి వచ్చిన విషయం తెలిసిందే.

Also Read: వైసీపీ అధినేత జగన్‌పై నాగబాబు ఫైర్..

Advertisment
Advertisment
తాజా కథనాలు