Earthquake: భారీ భూకంపం.. 140కి చేరిన మృతుల సంఖ్య

శుక్రవారం రాత్రి నేపాల్‌లో భూకంపం రావడంతో మృతుల సంఖ్య 140కి చేరింది. వాయువ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో రిక్టార్‌ స్కేల్‌పై 6.4 తీవ్రతతో ఈ భూకంపం సంభవించినట్లు యూఎస్‌ జియోలాజికల్ సర్వే తెలిపింది.

Earthquake: భారీ భూకంపం.. 140కి చేరిన మృతుల సంఖ్య
New Update

నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 140కి చేరింది. వందల సంఖ్యలో గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. నేపాల్‌లోని శుక్రవారం రాత్రి 11 గంటల తర్వాత వాయువ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూకంపం వచ్చినట్లు గుర్తించారు. రిక్టర్‌ స్కేల్‌పై 6.4 తీవ్రతతో ఈ భూకంపం సంభవించినట్లు యూఎస్‌ జియోలాజికల్ సర్వే చెప్పింది. భూకంప కేంద్రం 11 మైళ్ల లోతులో ఉన్నట్లు గుర్తించింది. ఈ తీవ్రత ప్రభావానికి భారత్‌లోని పలు ప్రాంతాల్లో కూడా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీతో పాటు ఉత్తర్‌ప్రదేశ్, బిహార్ లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి.

నేపాల్ రాజధాని కాట్నాండ్‌కు 400కి.మీల దూరంలో ఉన్న జజర్‌కోట్‌లో భూకంప కేంద్రం గుర్తించినట్లు నేపాల్‌ జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం తెలిపింది. ఈ భూకంపం ధాటికి పలు జిల్లాలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. రుకమ్‌, జజర్‌కోట్‌  జిల్లాల్లో  ఇళ్లు కూలి చాలా మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. రాత్రి సమయం కావడంతో సహాయ చర్యలు కష్టంగా మారాయని, మరికొన్ని చోట్లు కొండచరియలు విరిగిపడి వెళ్లలేకపోయినట్లు చెప్పారు. ఇక మృతుల కుటుంబాలకు నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ సంతాపం ప్రకటించారు. భూకంపం వచ్చిన సమయంలో ప్రజలందరూ నిద్రలో ఉండటంతో ప్రాణనష్టం భారీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక 2015లో 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపం దాదాపు 9వేల మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

#earthquake #nepal
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe