Lok Sabha Elections 2024 Phase 5: లోక్‌సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ ముగిసింది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 49 ఎంపీ స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఎలక్షన్ కమిషన్ (Election Commission) గణాంకాల ప్రకారం.. సాయంత్రం 7 గంటల వరకు దాదాపు 57.38 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో (West Bengal) 73 శాతం, అత్యల్పంగా మహారాష్ట్రలో (Maharashtra) 48.88 శాతం ఓటింగ్ నమోదైంది.
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ కావాలనుకునే వారికి గుడ్‌న్యూస్..
ఇదిలాఉండగా.. ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో పలుచోట్ల అల్లర్లు జరిగాయి. ఒడిశాతో పాటు పలు రాష్ట్రాల్లో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో EVM లు మోరాయించాయి. లోక్ సభ ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. నేటితో ఐదో దశ పూర్తయింది. ఇంకా రెండు దశల ఎన్నికలు మిగిలి ఉన్నాయి. మే 25, జూన్1 న ఈ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4 న కౌంటింగ్ నిర్వహిస్తారు. ఇక దేశంలో మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అయిదో దశతో కలిపి ఇప్పటివరకు 428 సీట్లకు పోలింగ్ పూర్తయింది. అయితే ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగు దశల్లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 66.95 శాతం పోలింగ్ నమోదైంది. అయితే ఈసారి కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారనేది దేశవ్యాప్తంగా ఉత్కంంఠ నెలకొంది.
Also Read: స్టాక్ మార్కెట్ జూన్ 4 తరువాత పరుగులు తీస్తుందంటున్న పీఎం మోదీ