Mahalakshmi Gas Scheme : కాంగ్రెస్(Congress) ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారెంటీల దరఖాస్తు ప్రక్రియపై జనాల్లో అనేక అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. దరఖాస్తులకు ఏమేమి కావాలి, ఏమి తీసుకెళ్తే అన్ని పథకాలకు అప్లై చేయొచ్చా? లేదా?, ఈ పథకం కోసం ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు లాంటి పలు అంశాలపై అనేక మందిలో సందేహం నెలకొంది. అయితే, ప్రభుత్వం చేపట్టిన ప్రజలపాలన కింద దరఖాస్తుల కార్యక్రమాన్ని కొందరు కేటుగాళ్లు ఆసరాగా చేసుకుంటున్నారు. దరఖాస్తు ఫారాల కొరకు ప్రజల నుంచి దండిగా డబ్బు తీసుకుంటున్నారు. డబ్బులు ఇస్తే పథకాలు మీకు వస్తాయంటూ ప్రజల దగ్గర నుంచి డబ్బును ఈజీగా కాజేస్తున్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పథకాల కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు అంటూ హెచ్చరించింది. ఈ పథకాల కోసం ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
ALSO READ : తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. 2 రోజులు దరఖాస్తులు బంద్!
ఇదిలా ఉండగా.. రూ. 500కే గ్యాస్ సిలిండర్ పథకం(Mahalakshmi Gas Scheme) పై జనాల్లో గందరగోళం నెలకొంది. KYC అయితేనే రూ. 500కి సిలిండర్ ఇస్తారనే ప్రచారం జోరందుకుంది. దీంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద జనాలు క్యూ కడుతున్నారు. KYCతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని అధికారులు తేల్చి చెప్పారు. అధికారులు చెప్పినప్పటికీ జనం వినిపించుకోవడం లేదు. 6 గ్యారంటీల దరఖాస్తు ఫామ్‌లోనూ ఎక్కడా KYC ప్రస్తావన లేదు. వంటగ్యాస్ వినియోగదారులు KYC చేసుకోవాలని గతంలోనే కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. కేవలం వినియోగదారుల సమచారం కోసం మాత్రమే KYC ని కేంద్ర ప్రభుత్వం దీన్ని అమలు చేసింది. KYC అప్డేట్ కోసం ఎలాంటి డెడ్ లైన్ లేదని స్పష్టం చేసింది. భర్త పేరు మీద ఉన్న కనెక్షన్ భార్యపేరు మీదకి మార్చడానికి పెద్ద మొత్తంలో డబ్బులు వసూల్ చేస్తున్నారట కొందరు కేటుగాళ్లు. ప్రజలు దీనిపై అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను కోరింది.
ALSO READ: మార్చి 18 నుంచి టెన్త్ పరీక్షలు.. నేడు ప్రకటన?