Govt Jobs 2023: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. టెన్త్ అర్హతతో 50 వేల గవర్నమెంట్ జాబ్స్!

మీరు పదోతరగతి పాస్ అయితే చాలు. కానిస్టేబుల్ జాబ్ మీ సొంతం. 50వేలకు పైగా కానిస్టేబుల్ నియామకాలకు ఎస్ఎస్సీ రెడీ అవుతోంది. నవంబర్ 24న నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది.

Jobs: ఆంధ్ర నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..విశాఖ, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు
New Update

మీరు పది పాస్ అయ్యారా? అయితే మీకో గుడ్ న్యూస్. పదిపాస్ అయితే చాలు కానిస్టేబుల్ జాబ్ కొట్టేయ్యెుచ్చు. కేవలం పదోతరగత అర్హతతో ప్రతిఏటా భారీగా ఉద్యోగ ప్రకటనలు వస్తున్నాయి. ఆ వివరాలు మీకోసం.

పదవ తరగతి ఉత్తీర్ణత అయితే చాలు కానిస్టేబుల్ ఉద్యోగం పొందవచ్చు. ప్రతిఏడాది వలే ఈ ఏడాది కూడా కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగాల కోసం భారీ నోటిఫికేషన్ రెడీ అవుతోంది. భారీ సంఖ్యలో కానిస్టేబుల్ నియామకాలకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిద్ధమవుతోంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు ఉండే వార్షిక క్యాలెండర్ ప్రకారం ప్రతిఏటా కూడా నవంబర్ 24న ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 28నాటికి పూర్తవుతుంది.

గతేడాది నవంబర్ నెలలో ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ సాయుధ బలగాల్లో 50, 187 కానిస్టేబుల్ రైఫిల్ మ్యాన్, సిపాయి పోస్టులను భర్తీ చేశారు. అయితే ఈ ఏడాది అంత కంటే ఎక్కువ సంఖ్యలోనే పోస్టులను భర్తీ చేస్తారని పలు నివేదికల ద్వారా సమాచారం అందుతోంది.

ఇది కూడా చదవండి: నువ్వు భయపెడితే.. ఎవ్వరు భయపడరు.. పక్కకెళ్లి ఆడుకో..!

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి పదవ తరగతి విద్యార్హత ఉంటే సరిపోతుంది. రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ పరీక్ష, వైద్య పరీక్షలు నిర్వహించి ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు. ఆ తర్వాత మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేస్తారు. రిజర్వేషన్ ఆధారంగా పోస్టులు భర్తీ చేస్తారు.

కేంద్ర సాయుధ బలగాల్లో ఈ ఏడాది కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీలను ఎస్ఎస్సీ ప్రకటించింది. కానిస్టేబుల్ రాత పరీక్షలు నవంబర్ 14,15,16,17,20, 2,1,22,23,24,28,29,30, డిసెంబర్ 1, 2, 3వ తేదీల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. వచ్చే ఏడాది (2024) కానిస్టేబుల్ (SSC GD Constable) రాత పరీక్షలు ఫిబ్రవరి 20, 21, 22, 23, 24, 26, 27, 28, 29 మార్చి 1, 5, 6, 7, 11, 12వ తేదీల్లో దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో జరుగుతుందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. గ్రూప్-1, 2 నోటిఫికేషన్లపై ఏపీపీఎస్సీ కీలక ప్రకటన!

#jobs #govt-jobs-2023
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe