Bigg Boss 7 Telugu Promo: నువ్వు భయపెడితే.. ఎవ్వరు భయపడరు.. పక్కకెళ్లి ఆడుకో..!

బిగ్ బాస్ సీజన్ 7 ఈరోజు ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ప్రోమోలో  బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులకు సెకండ్ ఛాలెంజ్ ఇచ్చారు. ఈ టాస్క్ లో అమర్, రతిక ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగినట్లుగా ప్రోమోలో కనిపించింది.

New Update
Bigg Boss 7 Telugu Promo: నువ్వు భయపెడితే.. ఎవ్వరు భయపడరు.. పక్కకెళ్లి ఆడుకో..!

Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ సీజన్ 7 ఈరోజు ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. బిగ్ బాస్ ఇంట్లో కెప్టెన్సీ టాస్క్ (Captaincy Task) కొనసాగుతూనే ఉంది. ఈ టాస్క్ లో ఇంటి సభ్యులు 'గర్జించే పులులు', 'వీర సింహాలు' ఇలా రెండు టీమ్స్ గా విడిపోయారు. నిన్న ఎపిసోడ్  కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా జరిగిన మొదటి ఛాలెంజ్ లో 'వీర సింహాలు'  టీం విన్ అయ్యారు. ఇక ఈరోజు ప్రోమోలో  బిగ్ బాస్ ఇంటి సభ్యులకు సెకండ్ ఛాలెంజ్ ఇచ్చారు. ఈ ఛాలెంజ్ లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ 'బ్రేక్ ఫాస్ట్'  ఈ టాస్క్ లో ఇరు టీమ్స్ నుంచి ఇద్దరు సభ్యులు టాస్క్ లో పాల్గొన్నారు.

Bigg Boss 7 Telugu

ఇక టాస్క్ ఆడుతున్న సమయంలో గౌతమ్ (Goutham), అమర్ (Amar) ఇద్దరు..  బిగ్ బాస్ నిన్న టాస్క్ లో  ఇరు టీమ్స్ కు ఇచ్చిన బ్యాగ్స్ కోసం గొడవ పడుతూ కనిపించారు. ఈ విషయంలో రతిక అమర్ ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఒకరి పై గట్టి గట్టిగా అరుచుకున్నారు.

publive-image

గొడవ మధ్యలో రతిక మాట్లాడుతూ.. అమర్ మా బ్యాగ్స్ ఎందుకు పడేశావని ప్రశ్నించింది. దానికి అమర్.. అవును పడేస్తా.. నా ఇష్టం.. ఇది నా స్ట్రాటజీ అంటూ రెచ్చిపోయాడు. దాంతో రతిక (Rathika) ప్రతి వెదవ పని చేయడం.. దానికి మళ్ళీ స్ట్రాటజీ అని పేరు పెట్టడం అంటూ అమర్ పై అరిచేసింది. ఇంక అమర్ ఊరుకుంటాడా..  నువ్వు చెప్పోద్దులే వెదవ పనుల గురించి.. నువ్వు భయపెడితే ఇక్కడ ఎవ్వరు భయపడరు.. పక్కకెళ్లి ఆడుకో అంటూ తిరిగి కౌంటర్ ఇచ్చాడు.

publive-image

ప్రోమోలో చూపిన ప్రకారం బిగ్ బాస్ ఇచ్చిన సెకండ్ ఛాలెంజ్ లో 'వీర సింహాలు' టీం నుంచి గౌతమ్, శోభ (Shobha).. 'గర్జించే పులులు' టీం నుంచి అర్జున్, అమర్  టాస్క్ లో పాల్గొన్నారు. ఇరు టీమ్స్ చాలా ఫాస్ట్ గా టాస్క్ పూర్తి చేయడానికి ప్రయత్నించారు.. కానీ  ముందుగా 'గర్జించే పులులు' టాస్క్ పూర్తి చేసి ఛాలెంజ్ విన్ అయినట్లుగా ప్రోమోలో కనిపించింది.

Bigg Boss 7 Telugu

Bigg Boss 7 Telugu

 Also Read: Varun Tej- Lavanya: వరుణ్ బరాత్ లో నాగబాబు, నిహారిక డాన్స్ వీడియో వైరల్..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు