Liver Damage : లివర్ డ్యామేజ్ సంకేతాలు రాత్రిపూట కనిపిస్తాయి.. అప్రమత్తంగా ఎలా ఉండాలో తెలుసుకోండి!

జీవనశైలి చెడుగా ఉంటే కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది. దాని లక్షణాలు రాత్రిపూట కనిపిస్తాయి. కడుపు నొప్పి, చర్మంలో దురద, మైకం, వాంతులు, వికారం, మూత్రం రంగులో మార్పు, కాళ్ల కింది భాగంలో వాపు వంటి లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్లని సంప్రదించాలి.

New Update
Liver Damage : లివర్ డ్యామేజ్ సంకేతాలు రాత్రిపూట కనిపిస్తాయి.. అప్రమత్తంగా ఎలా ఉండాలో తెలుసుకోండి!

Liver Damage Alert : చెడు ఆహారపు అలవాట్లు, ధూమపానం (Smoking) వంటి అలవాట్లు ఆరోగ్యంతోపాటు జీవన విధానం (Life Style) పై చెడుగా ప్రభావం పడుతుంది. దీనివల్ల కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది. సరైన సమయంలో దీనిని గుర్తించడంతోపాటు కాలేయ లక్షణాలను సకాలంలో గుర్తిస్తే ప్రమాదకరమైన వ్యాధి నుంచి కాలేయాన్ని కాపాడవచ్చు. కాలేయ నష్టం కొన్ని లక్షణాలు రాత్రిపూట కనిపిస్తాయి. వీటిని గుర్తించి చికిత్స తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు. కాలేయ నష్టం లక్షణాలు ఎలా ఉండాయో ఇప్పుడు చూద్దాం.

ఫ్యాటీ లివర్‌లో ఎన్ని రకాలు:

ఎక్కువగా ఆల్కహాల్ తాగడం, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌ (Ultra Processed Food) తినడం, శారీరక శ్రమ చేయకపోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్యలు వస్తాయి. ఫ్యాటీ లివర్ వ్యాధి రెండు రకాలు. 1. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, 2. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్

  •  కాలేయం (Liver) దెబ్బతిన్నప్పుడు కడుపు నొప్పిగా ఉంటుంది. కాలేయం దెబ్బతిన్నప్పుడు దాని పని సామర్థ్యం తగ్గుతుంది. దీని కారణంగా కాలేయంపై ఒత్తిడి పెరిగి నొప్పి ఎక్కువ అవుతుంది.
  •  కాలేయంలో ఏదైనా సమస్య ఉంటే చర్మంపై దురద సమస్య ఉంటుంది. ముఖ్యంగా రాత్రిపూట దురద, చికాకు, దద్దుర్లు వంటి చర్మ సమస్యలు ఉంటే నిర్లక్ష్యం చేస్తే సమస్య తీవ్రమవుతుంది.
  •  వికారం, వాంతులు వంటి సమస్యలు కాలేయం దెబ్బతినడానికి ప్రధాన లక్షణం. ఈ రకమైన సమస్య రాత్రిపూట ఉండే వెంటనే డాక్టర్లని సంప్రదించాలి. ఆలస్యం చేస్తే కాలేయం, ఆరోగ్యానికి రెండు సమస్యలను కలిగిస్తుంది.
  •  మూత్రం రంగు మారడం కాలేయం దెబ్బతినడానికి సంకేతం. కాలేయం దెబ్బతిన్నప్పుడు.. శరీరంలో బిలిరుబిన్ స్థాయి పెరుగుతుంది. దీని కారణంగా మూత్రం రంగు ముదురు పసుపు రంగులోకి మారుతుంది.
  •  రాత్రి వేళల్లో కాళ్ల కింది భాగంలో వాపు ఉంటే జాగ్రత్తగా ఉండాలి. విపరీతమైన వాపు, నొప్పి కాలేయ సంబంధిత సమస్యలకు సంకేతాలు. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడ.. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read : హరీశ్ రావు ముక్కు నేలకు రాయాలి.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

Advertisment
తాజా కథనాలు