Soldiers Dead : లడఖ్‌లో ప్రమాదం.. ఐదుగురు ఆర్మీ జవాన్లు మృతి లడఖ్‌లో ఇండియన్ ఆర్మీ యుద్ధ విన్యాసాల్లో అపశ్రుతి జరిగింది. లేహ్‌కు 148 కిలోమీటర్ల దూరంలో ఉన్న మందిర్ మోర్ సమీపంలో టి 72 యుద్ధ ట్యాంకర్ నదిని దాటుతుండగా ఒక్కసారిగా నది ప్రవాహం పెరగడంతో ట్యాంకర్లో ఉన్న ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. By V.J Reddy 29 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Soldiers Dead : ఈరోజు తెల్లవారుజామున లడఖ్ (Ladakh) లోని నియోమా-చుషుల్ ప్రాంతంలోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఎసి) సమీపంలో టి -72 ట్యాంక్‌లో నదిని దాటుతుండగా నీటిమట్టం ఒక్కసారిగా పెరగడంతో ట్యాంక్ లో ఉన్న ఐదుగురు ఆర్మీ సైనికులు (Army Soldiers) చనిపోయినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. "లేహ్ కు 148 కిలోమీటర్ల దూరంలో ఉన్న మందిర్ మోర్ (Mandir More) సమీపంలో, ఉదయం 1 గంటలకు విన్యాసాలు చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఐదుగురు సైనికులతో ఉన్న T-72 ట్యాంక్ నదిని దాటుతుండగా ఆకస్మిక వరదల కారణంగా మునిగిపోయిందని తెలిపారు. ఘటన జరిగిన సమయంలో ట్యాంక్‌లో ఐదుగురు సైనికులు, ఒక జేసీఓ, నలుగురు జవాన్లు ఉన్నారు." అని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. A mishap took place in the Daulat Beg Oldie area of Ladakh during a tank exercise of crossing the river yesterday in the sector due to a sudden increase in water levels there. Loss of lives of Army personnel is feared. More details are awaited: Defence officials pic.twitter.com/my7pYEvWP8 — ANI (@ANI) June 29, 2024 Also Read : సీఎం మమతపై గవర్నర్ పరువు నష్టం దావా! #ladakh #t72-tank #army-soldiers #mandir-more మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి