Central Bank of India : బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India) తీపి కబురు అందించింది. తమ శాఖలో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 484 పోస్టులకు గానూ హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్, సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్/ సబ్-స్టాఫ్ పోస్టులకు ఆసక్తిగల, అర్హులైన అభ్యర్థులు కింద సూచించిన విధంగా అప్లై చేసుకోవాలి సూచించింది.
మొత్తం పోస్టులు: 484
జోన్లవారిగా ఖాళీలు:
అహ్మదాబాద్- 76, భోపాల్- 38, దిల్లీ- 76, కోల్‌కతా- 2, లఖ్‌నవూ- 78, ఎంఎంజడ్‌వో & పుణె- 118, పట్నా- 96 పోస్టులున్నాయి.
అర్హతలు :
పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 31.03.2023 నాటికి 18 - 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్ల, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
ఇది కూడా చదవండి : TREI-RB : త్వరలో సర్టిఫికేట్ వెరిఫికేషన్.. తుది దశకు గురుకుల నియామకాలు
అప్లికేషన్ ఫీజు :
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు రూ.175. ఇతరులకు రూ.850 చెల్లించాలి. ఆన్‌లైన్ విధానంలో 2023 డిసెంబర్ 20 నుంచి 2024 జనవరి 9 వరకూ అప్లయ్ చేసుకోవాలి.
ఎగ్జామ్స్ :
2024 జనవరిలోనే ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఎగ్జామ్ కాల్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలు కల్పించగా.. జనవరి చివరివారం లేదా ఫిబ్రవరి మొదటివారంలో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించి ఫిబ్రవరి లాస్ట్ వీక్ పరీక్ష ఫలితాల వెల్లడించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.ఇక ఆన్‌లైన్ పరీక్ష(70 మార్కులు), లోకల్ లాంగ్వేజ్ టెస్ట్(30 మార్కులు), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ పరీక్ష ఆంగ్ల మాధ్యమంలో ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్, ఎలిమెంటరీ అరిథ్‌మెటిక్, సైకోమెట్రిక్ టెస్ట్(రీజనింగ్) అంశాల్లో ప్రశ్నలుంటాయి. ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.14,500- రూ.28,145 జీతం అందించనున్నారు.
మరిన్ని వివరాల కోసం ఈ వెబ్‌సైట్ ను సంప్రదించండి: https://centralbankofindia.co.in/