Bhadrachalam: 43 అడుగులకు చేరుకున్న భద్రాచలంలో గోదావరి నీటి మట్టం

తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వరదల కారణంగా గోదావరి ఉప్పొంగుతోంది. దాంతో పాటూ ఎగువ నుంచి వస్తున్న వరద వల్ల నీటి మట్టం పెరుగుతోంది. కాసేపట్లో ఇది 43 అడుగులకు చేరనుంది. మరోవైపు వరద నీరు రోడ్ల మీదకు రావడం వలన ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాకు రాకపోకలు బంద్‌ అయ్యాయి.

New Update
Bhadrachalam: 43 అడుగులకు చేరుకున్న భద్రాచలంలో గోదావరి నీటి మట్టం

Warning Sign At Bhdrachalam: ఎగువ రాష్ట్రాలైన ఛత్తీస్గడ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద నీటిమట్టం పెరుగుతోంది. భద్రాచలం వద్ద సుమారుగా నలభై మూడు అడుగులకు నీటి మట్టం చేరుకుంటోంది.దీంతో గేట్ల నుండి నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. భద్రాచలం నుండి భారీగా పోలవరం కు చేరుకుంటున్న వరద నీరు పోలవరం వద్ద ఐదు లక్షల మూడు వేల క్యూసెక్కుల వరద నీరు ఇంట్లో గా ఉంది 48 గేట్లు ఎత్తివేసి వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు పోలవరం నుండి ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు భారీగా చేరుకుంటున్న వరద నీరు నాలుగు లక్షల 175 గేట్లను తెరిచి సముద్రంలో వదులుతున్నారు.

ప్రధానంగా దిగువన శబరికి భారీ వరద వచ్చింది. ఛత్తీస్గడ్, ఒడిస్సా రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున వర్షాలు పడుతుండటంతో గోదావరికి వరద పోటు మొదలైంది. రద నీరు కారణంగా భద్రాచలం స్నానఘట్టం మెట్ల వరకు నీరు వచ్చేసింది. ప్రస్తుతం ఇక్కడ ప్రస్తుతం 8,38,117 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. చర్ల మండలం దగ్గర ఈత వాగుపై నుంచి వరద నీరు రావడంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలం వద్ద సీతవాగు, గుబ్బల మంగి వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో పర్ణశాల దగ్గర నార చీరల ప్రాంతం వరద నీటిలో మునిగింది.

ఇక మరోవైపు భద్రాచలం నుంచి ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలకు వెళ్లే ప్రధాన రహదారి చట్టి వద్ద వరద నీరు చేరడంతో తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 163వ నెంబరు జాతీయ రహదారిపై వరదనీరు చేరింది. దీంతో ఈ జాతీయ రహదారిలో వాహనాల రాకపోలను అధికారులు నియంత్రించారు. వాహనాలు వెళ్కుండా ట్రాక్టర్లు, ట్రక్కులను అడ్డం పెట్టారు. పోలీసులు అక్కడే ఉండి అందరినీ అలెర్ట్ చేస్తున్నారు. వరద పరిస్థిి చేయి దాటకుండా అధికారులు అక్కడే ఉండి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.

Also Read:Nature: అమ్మో ఆ కప్పలు చాలా డేంజర్…

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు