Pm Modi: కువైట్ అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ సమీక్ష..బాధితులకు అండగా ఉంటామని హామీ

కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 40 మంది భారతీయులు చనిపోయారు. దీని మీద భారత ప్రధాని అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రమాద కారణాలను తెలుసుకున్న ఆయన బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

New Update
Pm Modi: కువైట్ అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ సమీక్ష..బాధితులకు అండగా ఉంటామని హామీ

PM Modi Meeting On Kuwait Fire Accident: బుధవారం తెలలవారు ఝామున కువైట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇందులో మొత్తం 49మంది చనిపోగా...అందులో 40 మంది భారతీయులే ఉన్నారు. వీరందరూ సీవదహనం అయ్యారు. బుధవారం ఉదయం 6 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రమాదం జరిగిన సమయంలో 160 మంది ఆ భవనంలో ఉన్నారని.. వీళ్లందరూ కూడా ఒకే కంపెనీలో పనిచేస్తున్నట్లు పేర్కొంది. ముందుగా కిచెన్‌లో ప్రారంభమైన ఆ మంటలు క్షణాల్లోనే భవనమంతా వ్యాపించాయని అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదంపై ఉదయమే స్పందించిన భారత ప్రధాని మోదీ తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విదేశాంగ్ మంత్రి జైశంకర్‌ కూడా మృతుల కటుంబాలకు సంతాపం తెలిపారు. కువైట్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇక దీనిపై ప్రధాని మోదీ ఒడిశా పర్యటన అనంతరం అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద తీవ్రతను అధికారులు డిజిటల్ స్క్రీన్ ద్వారా వివరించారు.

తక్షణమే వెళ్ళాలి.. 

మరోవైపు ఉప ప్రధాన మంత్రి షేక్ ఫహాద్ అల్-యూసుఫ్ అల్-సబా ప్రదేశాన్ని సందర్శించారు మరియు భవనం యజమానిని అరెస్టు చేయాలని ఆదేశించారు. భారత రాయబారి కూడా ఘటనా స్థలానికి వెళ్ళి సందర్శించారు. ప్రమాదానికి గురైన భవనం మొత్తం కార్మికులను ఉంచడానికి వినియోగించారు. చనిపోయిన వారు కాకుండా మరో 50మంది భారతీయులు తీవ్ర గాయాల పాలయ్యారు. వారందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని...వారికి పూర్తి సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన భారతీయులను ఆదుకునేందుకు జూనియర్ విదేశాంగ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ వెంటనే కువైట్ వెళ్ళాలని ప్రధాని మోదీ ఆదేశించారు.దీంతో ఆయన వెంటనే కువైట్  వెళ్లనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది.

Also Read:T20 World Cup: సూపర్ 8కు భారత్..యూఎస్‌ మీద గెలుపు

Advertisment
తాజా కథనాలు