అహ్మదాబాద్‌లో నలుగురు టెర్రరిస్ట్ లను అరెస్ట్ చేసిన కేంద్ర నిఘా సంస్థ..

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బలగాలు నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశాయి. మొత్తం నలుగురు టెర్రరిస్ట్ లను అరెస్ట్ చేసిన అధికారులు..వారిని శ్రీలంకకు చెందిన వారిగా గుర్తించారు.

అహ్మదాబాద్‌లో నలుగురు టెర్రరిస్ట్ లను అరెస్ట్ చేసిన కేంద్ర నిఘా సంస్థ..
New Update

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నలుగురు ఉగ్రవాదులను కేంద్ర నిఘా సంస్థ అరెస్ట్ చేసింది. ముందుగా విమానాశ్రయంలో ఉన్నారని గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌కు సమాచారం అందగా..విమానాశ్రయానికి చేరుకుని ముమ్మరంగా సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో నలుగురు ISIS ఉగ్రవాదులను యాంటీ టెర్రరిజం స్క్వాడ్ గుర్తించి అరెస్ట్ చేసింది.

విచారణలో, మొత్తం నలుగురు శ్రీలంకకు చెందినవారు. చెన్నై నుంచి అహ్మదాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. పాకిస్థాన్‌లోని తమ భాగస్వాముల నుంచి సమాచారం కోసం వారు ఎదురుచూస్తున్నట్లు సమాచారం. వారి ఉద్దేశ్యాన్ని తెలుసుకోవడానికి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ప్రస్తుతం రహస్య ప్రదేశంలో దర్యాప్తు చేస్తోంది. వారి ప్రయోజనం ఏమిటి? అనే విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

#gujarat #arrested #isis-terrorists
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe