Richest King : రాజు(King) ల గురించి, రాజుల రాజ భవనాలు, విలాసవంతమైన సౌకర్యాల గురించి పుస్తకాల్లో మాత్రమే చదువుతాం. కానీ థాయిలాండ్ రాజు మాత్రం పుస్తకంలో చదివిన కథలా ఉంటాడు. థాయ్‌లాండ్ రాజు మహా వజిరాలాంగ్‌కార్న్(The King of Thailand is Maha Vajiralongkorn) అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ప్రజలు అతన్ని కింగ్ రామ X అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన కింగ్ వజిరాలాంగ్ కోర్న్ వద్ద మీ ఊహకు అందని వజ్రాలు, నాణేలు ఉన్నాయి. రాజా వజిరాలాంగ్‌కార్న్ జూలై 28, 1952న జన్మించారు. ఇప్పుడు ఆయన వయసు 71 ఏళ్లు. వజిరాలాంగ్ కోర్న్ అనేది రాజకుటుంబం నుండి సంక్రమించిన విస్తారమైన ఆస్తి ఆయన సొంతం. అంతేకాదు వేల ఎకరాల భూమి, అనేక ఖరీదైన కార్లు, విలాసవంతమైన వస్తువులు ఉన్నాయి. ఫైనాన్షియల్ టైమ్స్ ప్రకారం, థాయ్‌లాండ్ రాజకుటుంబ సంపద 40 బిలియన్ డాలర్లు అంటే 3.2 లక్షల కోట్లుగా అంచనా వేసింది.
థాయ్‌లాండ్ రాజు మహా వజిరాలాంగ్‌కార్న్ యొక్క భారీ సంపద:
మహా వజిరాలాంగ్‌కార్న్ రాజు ఆస్తి..ఎంతలా ఉందంటే...ఆయన ఎస్టేట్ థాయిలాండ్ దేశం అంత ఉంటుంది. అతను థాయ్‌లాండ్‌లో 6,560 హెక్టార్ల (16,210 ఎకరాలు) భూమిని కలిగి ఉన్నాడు. రాజధాని బ్యాంకాక్‌లో 17,000 ఒప్పందాలతో సహా దేశవ్యాప్తంగా 40,000 అద్దె ఒప్పందాలు ఉన్నాయి.ఈ భూముల్లో మాల్స్, హోటళ్లు సహా అనేక ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. నివేదికల ప్రకారం, థాయ్‌లాండ్‌లోని రెండవ అతిపెద్ద బ్యాంకు అయిన సియామ్ కమర్షియల్ బ్యాంక్(Siam Commercial Bank) లో కింగ్ మహా వజిరాలాంగ్‌కార్న్ 23 శాతం వాటాను కలిగి ఉన్నారు. దేశంలోని అతిపెద్ద పారిశ్రామిక దిగ్గజం సియామ్ సిమెంట్ గ్రూప్‌లో 33.3 శాతం వాటాను కలిగి ఉన్నారు.
Also Read : Sabarimala: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరిమలకు ఫ్రీ బస్సు?
రాజు కిరీటంలో చాలా వజ్రాలు ఉన్నాయి:
ఈ రాజు ధరించే కిరీటం సామాన్యమైనది కాదు. 545.67 క్యారెట్ బ్రౌన్ గోల్డెన్ జూబ్లీ డైమండ్ ఈ కిరీటంలో ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఖరీదైన వజ్రంగా ప్రసిద్ధి చెందింది. దీని విలువ రూ.98 కోట్లు అని వజ్ర అధికారి చెప్పారు.రాజుకు 21 హెలికాప్టర్లు ఉన్నాయి. అలాగే 17 విమానాలు ఉన్నాయి. అతను బోయింగ్, ఎయిర్‌బస్ ఎయిర్‌క్రాఫ్ట్, సుఖోయ్ సూపర్‌జెట్‌తో సహా అనేక విమానాలను కలిగి ఉన్నాడు. ఈ విమానాల నిర్వహణకు ఏటా రూ.524 కోట్లు ఖర్చు చేస్తారు.
ఖరీదైన కార్లు:
కింగ్ రామ Xకి లిమోసిన్, మెర్సిడెస్ బెంజ్ సహా 300 కంటే ఎక్కువ ఖరీదైన కార్లు ఉన్నాయి. అంతేకాకుండా రాజు వద్ద 52 పడవలు ఉన్నాయి. మొత్తం 52 పడవల్లో బంగారు నగిషీలు ఉన్నాయి.
కింగ్స్ హౌస్:
థాయిలాండ్ రాజు(Thailand King) ప్యాలెస్ 23,51,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. రాజభవనాన్ని 1782లో నిర్మించారు. కింగ్ రామ్ X ఈ ప్యాలెస్‌లో నివసించనప్పటికీ, ప్యాలెస్‌లో అనేక ప్రభుత్వ కార్యాలయాలు, మ్యూజియంలు ఉన్నాయి.థాయ్ రాజకుటుంబానికి సంపద ప్రధాన వనరులు సియామ్ కమర్షియల్ బ్యాంకులు, సియామ్ సిమెంట్ గ్రూప్, భూమి అద్దె. వీటి ద్వారా రాజు భారీ ఆదాయం సమకూరుతుంది.
ఇది కూడా చదవండి: బడ్జెట్లో ఉద్యోగులకు వరాల జల్లులు..ఈసారి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా.?