Richest King : రాజు(King) ల గురించి, రాజుల రాజ భవనాలు, విలాసవంతమైన సౌకర్యాల గురించి పుస్తకాల్లో మాత్రమే చదువుతాం. కానీ థాయిలాండ్ రాజు మాత్రం పుస్తకంలో చదివిన కథలా ఉంటాడు. థాయ్లాండ్ రాజు మహా వజిరాలాంగ్కార్న్(The King of Thailand is Maha Vajiralongkorn) అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ప్రజలు అతన్ని కింగ్ రామ X అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన కింగ్ వజిరాలాంగ్ కోర్న్ వద్ద మీ ఊహకు అందని వజ్రాలు, నాణేలు ఉన్నాయి. రాజా వజిరాలాంగ్కార్న్ జూలై 28, 1952న జన్మించారు. ఇప్పుడు ఆయన వయసు 71 ఏళ్లు. వజిరాలాంగ్ కోర్న్ అనేది రాజకుటుంబం నుండి సంక్రమించిన విస్తారమైన ఆస్తి ఆయన సొంతం. అంతేకాదు వేల ఎకరాల భూమి, అనేక ఖరీదైన కార్లు, విలాసవంతమైన వస్తువులు ఉన్నాయి. ఫైనాన్షియల్ టైమ్స్ ప్రకారం, థాయ్లాండ్ రాజకుటుంబ సంపద 40 బిలియన్ డాలర్లు అంటే 3.2 లక్షల కోట్లుగా అంచనా వేసింది.
పూర్తిగా చదవండి..Richest King : 38 విమానాలు, 300 కార్లు, 98 కోట్ల విలువైన వజ్రాలు..ఇవన్ని ఏ రాజు దగ్గర ఉన్నాయో తెలుసా..?
థాయ్లాండ్ రాజు మహా వజిరాలాంగ్కార్న్ గడుపుతున్న జీవితాన్ని చూస్తే షాక్ అవ్వాల్సిందే. ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన కింగ్ వజిరాలాంగ్ కోర్న్ వద్ద మీ ఊహకు అందని వజ్రాలు, నాణేలు ఉన్నాయి.8 విమానాలు, 300 కార్లు, 98 కోట్ల విలువైన వజ్రాలు ఉన్నాయి.
Translate this News: