Vistara: మరో 38 విమానాలను రద్దు చేసిన విస్తారా.. కారణం అదేనా!

విస్తారా సంస్థను సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. ఎయిరిండియాలో ఈ సంస్థ విలీనానికి ముందు జీతాల విధానాన్ని సవరించడాన్ని నిరసిస్తూ పైలెట్లు విధులకు హాజరు కావడం లేదు.పైలెట్ల కొరత ఉండడంతో 38 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు విస్తారా విమానాయన సంస్థ ప్రకటించింది.

Free Wifi: విమానాల్లో ఫ్రీ వైఫై..ఏ ఎయిర్‌ లైన్స్‌ లోనో తెలుసా!
New Update

Vistara: విస్తారా సంస్థను (Vistara) సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. ఎయిరిండియాలో ఈ సంస్థ విలీనానికి ముందు జీతాల విధానాన్ని సవరించడాన్ని నిరసిస్తూ పైలెట్లు విధులకు హాజరు కావడం లేదు. దీంతో మంగళవారం నాటికి విస్తారాలో పైలెట్ల సంక్షోభం మరింత పెరిగింది. ఆరోగ్య కారణాలను సాకు గా చూపించి విధులకు దూరంగా ఉంటున్నారు. దీంతో పైలెట్ల కొరత ఉండడంతో మంగళవారం ప్రముఖ నగరాల ఉంచి బయల్దేరాల్సిన 38 విస్తారా విమాన సర్వీసులను రద్దు చేసినట్లు విస్తారా విమానాయన సంస్థ ప్రకటించింది.

ఢిల్లీ నుంచి 12 సర్వీసులను, ముంబై నుంచి 15 సర్వీసులు, బెంగళూరు నుంచి 11 సర్వీసులను నిలిపివేస్తున్నట్లు విస్తారా ఎయిర్‌ లైన్స్‌ ప్రకటించింది. సోమవారం నాడు కూడా ఇదే పరిస్థితి నెలకొనగా... 50 కి పైగా సర్వీసులు రద్దవ్వగా.. సుమారు 160 విమానాలు ఆలస్యంగా నడిచాయి. సిబ్బంది లేకపోవడంతో పాటు వేర్వేరు కారణాలతో గత కొన్ని రోజులుగా విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు విస్తారా పేర్కొంది.

ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నట్లు విమానాయాన సంస్థ పేర్కొంది.విమాన సర్వీసుల పై సత్వర స్పందన లేకపోవడం, విమానాశ్రయంఓ గంటల తరబడి నిరీక్షణ గురించి ప్రయాణీకులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

Also read: ఏపీలో పాఠశాలలకు వేసవి సెలవులు ఎప్పటి నుంచి అంటే..!

#cancelled #vistara #air-india #flights
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి